The Raja Saab And Rajamouli: మన టాలీవుడ్ లో ‘రాజమౌళి కర్స్’ అనే సెంటిమెంట్ ఒకటి ఉంది. అంటే రాజమౌళి(SS Rajamouli) తో సినిమా చేసిన హీరో తదుపరి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ ఫ్లాప్ అవుతుంది అని. ఇప్పటి వరకు అదే జరుగుతూ వచ్చింది. ఒక్క ఎన్టీఆర్ విషయం లోనే ఈ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది. #RRR తర్వాత భారీ అంచనాల నడుమ విడుదలైన ‘దేవర’ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. కానీ ఆ సినిమాలో మరో హీరో గా నటించిన రామ్ చరణ్ మాత్రం ‘గేమ్ చేంజర్’ తో ఫ్లాప్ ని అందుకున్నాడు. ఎదో అదృష్టం తో ఎన్టీఆర్ ఒక్కడే బయటపడ్డాడు కానీ, ‘రాజమౌళి కర్స్’ సెంటిమెంట్ రీసెంట్ గా ప్రభాస్ కి కూడా తగిలిందని అంటున్నారు విశ్లేషకులు. రాజమౌళి తో ప్రభాస్(Rebel Star Prabhas) ప్రస్తుతం ఎలాంటి సినిమా చేయలేదు కదా?, మరి ఈ సెంటిమెంట్ ఎలా వర్తిస్తుంది అని మీరు అనుకోవచ్చు.
కానీ అసలు విషయం ఏమిటంటే, ‘రాజా సాబ్’ కి ముందు రాజమౌళి ‘బాహుబలి’ మూవీ రెండు భాగాలను కలిపి ‘బాహుబలి : ది ఎపిక్’ గా మార్చి, సరికొత్త వెర్షన్ ని భారీ ప్రొమోషన్స్ తో కొత్త సినిమాని ఎలా అయితే విడుదల చేస్తారో, అలా గ్రాండ్ గా విడుదల చేసాడు. పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ వచ్చింది. వడ కోట్ల గ్రాస్ కి పైగా వసూళ్లు వస్తాయని అనుకున్నారు కానీ, కేవలం 50 కోట్ల గ్రాస్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తెలుగు వెర్షన్ లో ఈ చిత్రాన్ని ఆడియన్స్ బాగా ఆదరించారు కానీ, హిందీ లో మాత్రం పెద్దగా చూడలేదు . అందుకే 50 కోట్ల వద్దే సినిమా ఆగిపోయింది. ఇకపోతే రీసెంట్ గానే ‘బాహుబలి : ది ఎపిక్’ చిత్రం ఓటీటీ లో కూడా విడుదలైంది.
ఇలా ఈ చిత్రానికి సంబంధించిన ప్రతీ విషయం కొత్త సినిమాకు చేసినట్టే చేశాడు రాజమౌళి. అందుకే ఇది రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో విడుదలైన డైరెక్ట్ సినిమాగా కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. రాజమౌళి సినిమా తర్వాత ‘రాజా సాబ్'(The Rajasaab Movie) విడుదలైంది కాబట్టి, ‘రాజమౌళి కర్స్’ సెంటిమెంట్ కారణంగానే ఫ్లాప్ అయ్యిందని అంటున్నారు. మరి మీరేమంటారు?, నిజంగానే రాజమౌళి కర్స్ సెంటిమెంట్ కారణంగానే ఈ చిత్రం ఫ్లాప్ అయ్యింది అంటారా?, లేకపోతే సినిమాలో విషయం లేకనే ఫ్లాప్ అయ్యిందని అంటారా?, మమ్మల్ని అడిగితే సినిమాలో విషయం లేకనే ఫ్లాప్ అయ్యిందని అంటాము. ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం ‘స్పిరిట్’ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. వచ్చే నెల నుండి ఆయన ‘కల్కి 2’ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.