The Raja Saab Collection Day 2: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) ‘రాజా సాబ్'(The Rajasaab Movie) చిత్రం నిన్న భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చి నెగిటివ్ టాక్ ని మూటగట్టుకుంది. కానీ ప్రభాస్ కి ఉన్నటువంటి భారీ మార్కెట్ కారణంగా ఈ సినిమాకు డీసెంట్ స్థాయి ఓపెనింగ్ వసూళ్లు నమోదు అయ్యాయి. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 90 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. నిన్నటి నూన్ మరియు మ్యాట్నీ షోస్ బాగా డల్ గా ఉన్నప్పటికీ, ఫస్ట్ షోస్, సెకండ్ షోస్ అద్భుతమైన ఆక్యుపెన్సీలను నమోదు చేసుకోవడం తో 90 కోట్ల గ్రాస్ ఓపెనింగ్ వచ్చింది. సాధారణంగా అంత గ్రాస్ వస్తుందని కూడా అనుకోలేదు ట్రేడ్ పండితులు. అయితే రెండవ రోజు మాత్రం మొదటి రోజు తో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో 70 శాతం కి పైగా డ్రాప్స్ ని సొంతం చేసుకుంది. ఓవర్సీస్ అయితే పూర్తిగా పడిపోయింది.
నార్త్ అమెరికా లో మొదటి రోజు + ప్రీమియర్ షోస్ కి కలిపి ఈ చిత్రానికి 1.7 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రెండవ రోజు కి అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ కేవలం లక్ష డాలర్లు మాత్రమే వచ్చింది. ఇది చాలా తక్కువ అనే చెప్పాలి. శనివారం రోజున నార్త్ అమెరికా లో ప్రతీ సినిమాకు మంచి గ్రాస్ నమోదు అవుతుంది, కానీ ఈ చిత్రానికి మాత్రం ఇంత తక్కువ గ్రాస్ అంటే కచ్చితంగా టాక్ ప్రభావం చాలా గట్టిగా పడింది అనే చెప్పాలి. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే నైజాం వరకు పర్వాలేదు అనిపించినా, ఆంద్ర ప్రదేశ్ లో మాత్రం డిజాస్టర్ వసూళ్లను నమోదు చేసుకుంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రానికి రెండవ రోజు తెలుగు రాష్ట్రాల నుండి 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కూడా వచ్చేలా కనిపించడం లేదు.
ఫస్ట్ షోస్ నుండి కచ్చితంగా పికప్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఎలాంటి మూవ్మెంట్ లేదు. ఇక మూడవ రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ని చూస్తుంటే నైజాం ప్రాంతం కూడా కలిసొచ్చేలా అనిపించడం లేదు. ఇదే ట్రెండ్ కొనసాగిస్తే, 12 వ తేదీన విడుదల అవ్వబొయె చిరంజీవి సినిమా కారణంగా రాజా సాబ్ తీవ్రమైన నష్టాలను ఎదురుకోవాల్సి వస్తుంది. దాదాపుగా క్లోజింగ్ వేసేసుకోవచ్చు. చూడాలి మరి ఫుల్ రన్ ఎలా ఉండబోతుంది అనేది. ఓవర్సీస్ మీద మాత్రం ఆశలు వదిలేసుకోవచ్చు, రేపటితో క్లోజ్ అయిపోతుంది. ఒక్క నార్త్ అమెరికా లోనే ‘రాజా సాబ్’ బ్రేక్ ఈవెన్ విలువ 7.5 మిలియన్ డాలర్లు. క్లోజింగ్ లో కనీసం 2.5 మిలియన్ డాలర్స్ కూడా వచ్చేలా కనిపించడం లేదు.