Huma Qureshi: సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్ల మీద జరిగే దాడులు చాలా సర్వసాధారణం. ముఖ్యంగా హాట్ హీరోయిన్ల పై, ఐటమ్ సాంగ్స్ లో నటించే అమ్మాయిల పై చాలా రకాలుగా దాడులు ఉంటాయి. అందుకే, ఇంటి నుంచి బయటకు వెళ్లిన హీరోయిన్, మళ్లీ ఇంటికి వచ్చే వరకూ ఆ హీరోయిన్ ఫ్యామిలీ టెన్షన్ పడుతూనే ఉంటుంది. తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ ‘హుమా ఖురేషి’ ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో హుమా ఖురేషి తన కెరీర్ లో చేదు సంఘటల గురించి వివరంగా వివరించింది.
హుమా ఖురేషి సినిమాల్లోకి వచ్చిన కొత్తలో.. ఓ రోజు సినిమా షూట్ కి ఉదయం 6 గంటలకు వెళ్ళింది. అది ఓ బడా హీరో సినిమా. ఆ సినిమాలో హుమా ఖురేషి స్పెషల్ సాంగ్ చేయడానికి ఆమెను తీసుకున్నారు. హుమా ఖురేషితో సదరు సినిమా ప్రోడ్యూసర్ చాలా ప్రేమగా మాట్లాడటం మొదలు పెట్టాడు. ఆమె కూడా సరదాగా మాట్లాడటం మొదలు పెట్టింది. ఆ మాటల మధ్యలో రూమ్ లోకి వెళ్దాం అని ఆమెను రూమ్ లోపలకు తీసుకువెళ్ళాడు సదరు నిర్మాత.
Also Read: Vishwak Sen: కుర్ర హీరోతో ముదురు హీరోయిన్ ఫిక్స్.. కొత్త రకం ప్రేమ
రూమ్ లోకి వెళ్ళగానే.. హుమా ఖురేషితో మాటలు కలుపుతూ..సడెన్ గా బట్టలు తీయమన్నాడట. హుమా ఖురేషికు పరిస్దితి అర్ధమై ఇలాంటివి నేను చేయను, వద్దు వద్దు అంటూ చాలా సేపు రిక్వెస్ట్ చేసిందట. ఇక అప్పుడు షూట్ కి టైం అవుతుంది. డ్రెస్ మార్చుకుని వెళ్లు.. టైంకి వెళ్ళకపోతే డైరెక్టర్ కూడా లోపలికి వస్తాడు అంటూ బెదిరించాడట సదరు నిర్మాత.
ఇక గతి లేక ఆ రూమ్ లోనే బట్టలు మార్చుకుందట హుమా ఖురేషి. ఆ ప్రోడ్యూసర్ కి విలువలు లేవు అని, అతను ఇంకా స్టార్ గానే ఉన్నాడని, స్టేజ్ ఎక్కితే.. తెగ నీతులు చెబుతాడు అని, కానీ.. చాటుగా బూతుల కంపులోనే బతుకుతాడు అని హుమా ఖురేషి చెప్పుకొచ్చింది. ఇక అప్పటి నుంచి హుమా ఖురేషి షూట్ కి వెళ్లే ముందు తెగ భయపడేది అట.
సెట్ లో ఎవరు వచ్చి ఎప్పుడు ఎలాంటి మాట చెబుతారో అని హుమా ఖురేషి తెగ బాధ పడేది అట. అందుకే, సినిమాల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలిసేది కాదు అని, కానీ.. ప్రస్తుతం ఎవరు ఎలాంటి వాళ్ళో ఒక క్లారిటీ ఉందని హుమా ఖురేషి చెప్పుకొచ్చింది.
Also Read:Krishna vamsi – Prabhas : క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీతో ప్రభాస్ సినిమా.. టైటిల్ ఇదే !