https://oktelugu.com/

Devara Movie : దేవర విషయం లో అది మిస్ అయింది…మరి పుష్ప 2 విషయం లో వర్కౌట్ అవుతుందా..?

నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో సినిమాలు చేయడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా సంపాదించి పెట్టుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న ప్రతి సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే పెరుగుతున్నాయి.

Written By:
  • Gopi
  • , Updated On : November 25, 2024 / 09:20 PM IST

    Devara

    Follow us on

    Devara Movie :  జూనియర్ ఎన్టీయార్ చేయబోయే తన తర్వాత సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు అయితే ఉన్నాయి. ఇక రీసెంట్ గా ఆయన కొరటాల శివ దర్శకత్వంలో చేసిన దేవర సినిమా సక్సెస్ టాక్ ను తెచ్చుకున్నప్పటికి భారీ వసూలను మాత్రం రాబట్టలేకపోయింది. ఇక దానికి కారణం ఏంటి అనే ధోరణిలో ఎన్టీఆర్ దానికి సంబంధించిన కారణాలను వెతుకుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ రాకపోవడానికి గల కారణం ఏంటి అంటే ఆయన సినిమాని చూడాలని చాలామంది జనాలు అనుకోవడం లేదు. నిజానికి బాలీవుడ్ లో అయితే ఆయన గురించి పెద్దగా ప్రస్తావనైతే రావడం లేదు. ‘త్రిబుల్ ఆర్’ సినిమాలో సెకండ్ హీరోగా ప్రమోట్ అయిన ఎన్టీయార్ దేవర సినిమా విషయంలో మాత్రం అంత బాగా ప్రమోట్ చేసుకోలేదనే చెప్పాలి. మరి బాలీవుడ్ జనాలు కూడా ఆయన సినిమాలు చూడడానికి పెద్దగా ఆసక్తి అయితే చూపించలేదు. కారణం ఏంటి అనేది ఎవరికీ తెలియదు. కానీ దేవర సినిమా మీద మొదట్లో మంచి హైప్ అయితే క్రియేట్ అయింది. కానీ ఆ తర్వాత సినిమాకి భారీ కలెక్షన్స్ రాకపోవడం అనేది అందరిని తీవ్రమైన నిరాశకు గురిచేసిందనే చెప్పాలి. ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులైతే ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. వాళ్ళ అంచనాల మీద నీళ్లు జలుతూ ఈ సినిమా లాంగ్ రన్ లో కేవలం 300 కోట్ల కలెక్షన్లు మాత్రమే రాబట్టడమనేది ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానుల్లో కూడా తీవ్రమైన నిరాశను రేకెత్తిస్తుంది.

    అందుకే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ లాంటి ఒక స్టార్ డైరెక్టర్ తో సినిమా చేసి తన మార్కెట్ పరిధిని పెంచుకోవాలని తన సినిమా మీద భారీ హైప్ ని క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ ఎలాంటి హైప్ అయితే క్రియేట్ చేసుకున్నాడో ఎన్టీఆర్ మాత్రం అలాంటి హైప్ ను తీసుకు రావడంలో చాలావరకు ఫెయిల్ అయ్యాడు.

    ఇక వీళ్ళిద్దరి మధ్య ఉన్న తేడా అదే సినిమాకి భారీ ఓపెనింగ్స్ రావాలంటే ముందుగా సినిమా మీద హైప్ అనేది క్రియేట్ చేయాలి. అలా చేస్తే సినిమా టాక్ బయటకు వచ్చేలోపే ఓపెనింగ్స్ రూపంలో సగం కలెక్షన్స్ సినిమాకి వచ్చేస్తాయి.

    దాని ద్వారా సినిమా కి నెగటివ్ టాక్ వచ్చిన కూడా సినిమా కలెక్షన్ల పరంగా సేఫ్ జోన్ లో ఉంటుందని చెప్పాలి. దేవర సినిమా విషయంలో అది మిస్ అయింది. మరి పుష్ప 2 సినిమా విషయంలో సక్సెస్ ఫుల్ గా భారీ ఓపెనింగ్స్ ను సంపాదిస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది…