spot_img
Homeఎంటర్టైన్మెంట్Lava Kusa: 500రోజులు ఆడిన ఏకైక మూవీ ల‌వ‌కుశ.. సీనియ‌ర్ ఎన్టీఆర్ స్టామినా ఇది..

Lava Kusa: 500రోజులు ఆడిన ఏకైక మూవీ ల‌వ‌కుశ.. సీనియ‌ర్ ఎన్టీఆర్ స్టామినా ఇది..

Lava Kusa: తెలుగులో పౌరాణిక సినిమాల‌కు పెట్టింది పేరు ఎన్టీఆర్‌. సీనియ‌ర్ ఎన్టీఆర్ ఏ పౌరాణిక పాత్ర చేసినా అది అద్భుత‌మే. ఆయ‌న చెప్పే డైలాగులు, ప‌ద్యాలు ఆద్యంతం ఆక‌ట్టుకుంటాయి. ఒక పాత్ర ఆయ‌న చేశారంటే.. ఆయ‌న త‌ప్ప ఆ పాత్ర‌కు ఇంకెవ్వ‌రూ సూట్ కాలేరేమో అన్న‌ట్టు జీవిస్తుంటారు. అందం, అభిన‌యంతో ఆయ‌న చేసిన పాత్ర‌లు ఒక చ‌రిత్ర అనే చెప్పుకోవాలి.

అయితే సీనియ‌ర్ ఎన్టీఆర్ చేసిన ల‌వ‌కుశ సినిమా గురించి ఇప్పుడు చెప్పుకోవాలి. ఇందులో సీనియ‌ర్ ఎన్టీఆర్ రాముడిగా, సీత‌గా అంజ‌లీ దేవి న‌టించారు. ఇందులో ల‌వ‌కుషులుగా ఇద్ద‌రు బాల‌న‌టులు న‌టించారు. అయితే ఈ సినిమాను తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో కూడా విడుద‌ల చేశారు. ఆ రోజుల్లో ఇదో పెద్ద సంచ‌ల‌నం అనే చెప్పుకోవాలి.

Also Read: Bigg Boss OTT Telugu Nominations: ఏడోవారంలో 8మంది నామినేట్‌.. అషు వ‌ల్ల అత‌ను బ‌లి.. ఇన్ని ట్విస్టులా..

ఎందుకంటే ఇండియ‌న్ సినీ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక రోజులు ఆడిన సినిమాగా అప్పుడు రికార్డుల‌కు ఎక్కింది. అంత‌కు ముందు ఎన్టీఆర్ న‌టించిన పాతాల భైర‌వి సినిమా 245రోజులు ఆడింది. కానీ ల‌వ‌కుశ ఆ రికార్డుల‌ను బ్రేక్ చేస్తూ తెలుగులో ఏకంగా 500రోజులు ఆడింది. ఆ రోజుల్లోనే ఏకంగా రూ.కోటి వ‌ర‌కు వ‌సూలు చేసి సంచ‌ల‌నం సృష్టించింది.

Lava Kusa
Lava Kusa

ఇదే సినిమా త‌మిళంలో ఏకంగా 40వారాలు ఆడింది. ఆ త‌ర్వాత హిందీలో రిలీజ్ చేయ‌గా.. అక్క‌డ కూడా 25 వారాలు ఆడి దుమ్ములేపింది. ఈ సినిమాను అల్లారెడ్డి శంక‌ర్ రెడ్డి నిర్మించారు. తెలుగులో ఇదే తొలి క‌ల‌ర్ సినిమా కావ‌డం విశేషం. ఇందులో వాల్మీకికి నాగ‌య్య‌, ల‌క్ష్మ‌ణుడిగా కాంతారావు, భ‌ర‌తుడిగా స‌త్యానారాయ‌ణ‌, శ‌త్ర‌ఘ్ఞ‌డిగా శోభ‌న్ బాబు, ల‌వుడుగా నాగ‌బాబు, కుశుడిగా సుబ్ర‌హ్మ‌ణ్యం న‌టించారు.

ఈ సినిమా 1963 మార్చి 29న ఈ సినిమా విడులైంది. ఈ సినిమాను చూసేందుకు అప్ప‌ట్లోనే ఊర్ల నుంచి ఎడ్ల బండ్లు క‌ట్టుకుని మ‌రీ జ‌నాలు థియేట‌ర్ల‌కు వెళ్లేవారంట‌. బాపు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా రిలీజ్ అయిన ప్ర‌తి సెంట‌ర్లో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఉత్త‌మ చిత్రంగా నంది అవార్డును కూడా అందుకుంది ఈ మూవీ.

Also Read:Sarkaru Vaari Paata Pre Release Business: రికార్డ్స్ తిరగ రాస్తున్న మహేష్ బాబు కొత్త సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Most Popular

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...

Talliki Vandanam Scheme 2026: తల్లికి వందనం.. రూ.13 వేలు జమ.. చెక్ చేసుకోండి!

Talliki Vandanam Scheme 2026: ఏపీ ప్రభుత్వం ఈరోజు ప్రతిష్టాత్మక పథకానికి సంబంధించి నిధులు జమ చేయనుంది. పాఠశాలతో పాటు ఇంటర్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద చదువుకు సాయం అందించనుంది....

NEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఒకరేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలి అంటారు. మరొకరేమో రాముడి నామాన్ని జపించకూడదు అంటారు. ఇంకొకరేమో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి మరింత స్వేచ్ఛ వాయువులు కల్పించాలని డిమాండ్...

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...
Oktelugu Epaper
Exit mobile version