Tollywood Young Hero: సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది స్టార్ హీరోలు మంచి విజయాలను దక్కించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎవరు చేయనటువంటి కొత్త కథలను ఎంచుకొని సినిమాలను చేస్తూ ఆ క్యారెక్టర్లలో ఒదిగిపోయి నటించి మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నారు. మరి వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికి వాళ్ల కంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో మాత్రం వాళ్ళు చాలా వరకు వెనుకబడిపోతున్నారనే చెప్పాలి… ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేస్తూ ముందుకు సాగినప్పటికి ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో మాత్రం హీరోలు విపరీతంగా పోటీ పడుతున్నారు. ఇక అందరిలో నాని మాత్రం మంచి సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం… ఇక ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు అతనికి మంచి విజయాలను సంపాదించి పెట్టాయి. మొన్నటిదాకా క్లాస్ సినిమాలు చేస్తూ వచ్చిన నాని ఇప్పుడు ఏకంగా మాస్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక తన తోటి హీరోలెవ్వరికి అందనంత రేంజ్ లో సక్సెస్ లను సాధిస్తూ వస్తున్నాడు. ఇక ఇప్పటికి వరుసగా నాలుగు విజయాలను సాధించిన ఆయన ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేసిన ప్యారడైజ్ (Paradaise) సినిమాతో మరో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడని ఈ సినిమా కోసం అహర్నిశలు చాలా కష్టపడుతున్నాడట…
Also Read: హరిహర వీరమల్లు ఇంటర్వెల్ ఎపిసోడ్ లో భారీ ట్విస్ట్ ఉంటుందా..?
ఇక ఇప్పటికే 30% షూట్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాతో టైర్ వన్ హీరోగా మారాలనే ప్రయత్నం చేస్తున్న నాని తన కలను నెరవేర్చుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. మరి తన తోటి హీరోలందరు ఎందుకు ఆయనలా సక్సెస్ సాధించలేకపోతున్నారు అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
ముఖ్యంగా నితిన్(Nithin), విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) లాంటి హీరోలు ప్రస్తుతం ప్లాపుల్లో ఉన్నారు. వాళ్ళు కనక మంచి కంబ్యాక్ ఇచ్చినట్లయితే వాళ్లకు కూడా మంచి మార్కెట్ అయితే క్రియేట్ అవుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి చూస్తుంటే వీళ్లు చేసే సినిమాలు ప్రేక్షకులను ఏమాత్రం ఇంప్రెస్ చేయలేకపోతున్నాయి. రీసెంట్ గా చేసిన తమ్ముడు (Thammudu) సినిమా భారీ డిజాస్టర్ ని మూటగట్టుకుంది.
ఆయన అలాంటి సినిమాలు ఎందుకు చేశాడు అని అతని అభిమానులు సైతం ఇబ్బంది పడుతున్నారు. మరి ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలోనైనా చాలా జాగ్రత్తలు తీసుకుంటే బావుంటుందని లేకపోతే ఆయనకున్న ఆ మాత్రం మార్కెట్ కూడా కోల్పోయే ప్రమాదం ఉందని మరి కొంతమంది సినిమా విమర్శకులు సైతం వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…