The Odyssey Movie Review: హాలీవుడ్ సినిమాలకు ఇండియాలో చాలా మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా క్రిస్టోఫర్ నోలన్ మూవీస్ నచ్చని ప్రేక్షకుడు ఉండడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. నిజానికి ఆయన సినిమాలో స్క్రీన్ ప్లే నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. సామాన్య జనాలకు ఆయన సినిమాలు ఒకసారి చూస్తే అర్థం కాదు. అందుకే ఆయన సినిమాలను చాలా మంది రిపీటెడ్ గా చూస్తుంటారు. ఇక ప్రస్తుతం ఆయన ‘ది ఒడిస్సీ’ అనే సినిమా చేశాడు. ఈ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ఎలా ఉంది సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనేది ఒకసారి మనం తెలుసుకుందాం…
కథ
ఇథిక అనే రాజ్యానికి రాజు అయిన ఒడిసియస్.. ట్రాయ్ అనే ప్రాంతంలో ట్రోజన్ యుద్ధం జరుగుతుంది. ఇందులో ఒడిసియస్ రాజు పాల్గొంటాడు. ఆ యుద్ధం ముగిసిన తర్వాత ఒడిసియస్ ఇథిక రాజ్యానికి రావాలి…తన కోసం ఆయన భార్య కొడుకు వెయిట్ చేస్తుంటాడు. కానీ ఆయన తన రాజ్యానికి వెళ్ళడానికి ఒక 10 సంవత్సరాల సమయాన్ని తీసుకుంటాడు. ఈ గ్యాప్ లో ఆయన ఏం చేశాడు ఆయన మనుగడ ఎలా గడిచింది అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సింది…
విశ్లేషణ
క్రిస్టోఫర్ నోలన్ సినిమాలు చూడాలంటే ఓపికగా ఉండాలి. అది పర్ఫెక్ట్ గా అర్థం చేసుకోవాలి. అలాగే ఈ సినిమాలో కథ ఈజీగా అందరికీ అర్థం అయ్యేలా ఉంది. మిగతా సినిమాలతో పోలిస్తే ఇందులో పెద్దగా కన్ఫ్యూజన్ ఏమి లేకుండా చాలా స్ట్రెయిట్ గా కథను చెప్పేశాడు. ఇక విజువల్స్ అయితే టాప్ నాచ్ లో ఉన్నాయి. నిజానికి కృష్ణోఫర్ నోలన్ గతంలో చేసిన ‘ఇన్సెప్షన్’ సినిమా రేంజ్ లో ఈ మూవీ కథ లేకపోయిన కూడా నోలన్ మార్క్ చాలా క్లారిటి గా కనిపించింది. నిజానికి సినిమాలో ప్రతి క్రాఫ్ట్ వాళ్ళు ప్రాణం పెట్టి వర్క్ చేశారు. నిజానికి ఇలాంటి సినిమాలో ఆ కాలం నాటి పరికరాలతో సంగీతాన్ని క్రియేట్ చేశారు అది బాగా ఎఫెక్టివ్ గా వర్కౌట్ అయింది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్లో ఒక హై ఫీల్ ఇస్తాయి…మెయిన్ లీడ్ లో చేసిన ‘మట్ డామన్’ కండ్లతోనే కొన్ని హావభావాలను పలికించాడు.
ఆయన ఈ సినిమాకి చాలా బాగా ప్లస్ అయ్యాడు… ఇక టెల్ మచాస్ క్యారెక్టర్ లో చేసిన ‘టామ్ హోలాండ్’ తన పాత్రకి పెర్ఫెక్ట్ గా న్యాయం చేశాడు. తన ఇంట్రడక్షన్ సీన్ లోనే అద్భుతంగా నటించి మెప్పించాడు… పెనెలోపో క్యారెక్టర్ లో చేసిన ‘అన్నీ హత్ వే’ కూడా చాలా బాగా నటించి మెప్పించింది. ఈ మూవీలో చేసిన ప్రతి నటి నటులు తమ ఇంటెన్స్ పర్ఫామెన్స్ ఇచ్చారు… ఇక విజువల్స్ ను ఒక పెయింటింగ్ ల చాలా చక్కగా తీర్చిదిద్దారు…ఇలాంటి మూవీస్ ను థియేటర్ లోనే చూడాలి…ఓవరాల్ గా ఈ సినిమా క్రిస్టోఫర్ నోలన్ మార్క్ తో పెర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేశారు…
ప్లస్ పాయింట్స్
విజువల్స్
మ్యూజిక్
యాక్షన్ ఎపిసోడ్స్
మైనస్ పాయింట్స్
కొన్ని సీన్స్ స్లో అయ్యాయి…
రేటింగ్ : 2.75/5
ఫైనల్ థాట్ : నోలన్ సినిమాలను ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది…
