Arnold Vosloo Vijay Deverakonda: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తోక్కుతూ ముందుకు సాగుతోంది. అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటి సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ…ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే తను చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు… విజయ్ దేవరకొండ లాంటి నటుడు సైతం ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫూల్ గా వ్యవహరిస్తున్నాడు. ఆయన ఏదైతే చేశాడో దానిని పర్ఫెక్ట్ ప్లానింగ్ ప్రకారం చేయడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతుండటం విశేషం… ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమాల్లో హాలీవుడ్ విలన్స్ ను తీసుకువస్తున్నారు. ఇక ఇంతకుముందు ఆయన చేసిన ‘లైగర్’ సినిమా కోసం ‘మైక్ టైసన్’ ను విలన్ గా తీసుకొచ్చారు.
ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం మమ్మీ సినిమాలో విలన్ గా చేసిన ఆర్నాల్డ్ ను విలన్ గా దింపాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక విజయ్ దేవరకొండ ఇప్పటివరకు వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తున్నప్పటికి అతనికి సరైన సక్సెస్ దక్కడం లేదు.
కారణం ఏదైనా కూడా ఆయన చేస్తున్న సినిమాల విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ సినిమా విమర్శకులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు… ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా విజయ్ దేవరకొండ కి ఉన్న క్లారిటీ ప్రకారం అతను సినిమాలను చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో ఆయన సక్సెస్ సాధిస్తే టాప్ హీరోగా ఎదుగుతాడు. లేకపోతే మాత్రం చాలా వరకు డీలా పడిపోయే అవకాశాలైతే ఉన్నాయి.
ఇక ఈ సంవత్సరం ‘కింగ్ డమ్’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయాడు. రాబోయే సినిమాలతో విజయ్ దేవరకొండ సక్సెస్ లను సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…ప్రస్తుతం తన తోటి హీరోలు భారీ విజయాలను సాధించాల్సిన అవసరమైతే ఉంది…