https://oktelugu.com/

Pushpa 2 The Rule : కొత్త సన్నివేశాలతో ‘పుష్ప 2’ నుండి సరికొత్త పాటను విడుదల చేసిన మూవీ టీం..ఇవి సినిమాలో పెట్టుంటే వేరే లెవెల్ ఉండేది!

ఈరోజుటితో ఈ చిత్రం హిందీ వెర్షన్ వసూళ్లు 600 కోట్ల రూపాయిల నెట్ వసూళ్ల మార్కుని దాటేసింది. ఈ వీకెండ్ తో షారుఖ్ ఖాన్ నటించిన 'జవాన్' చిత్ర వసూళ్లను దాటేస్తుందని అక్కడి ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వీడియో ని కాసేపటి క్రితమే మూవీ టీం విడుదల చేసింది.

Written By:
  • Vicky
  • , Updated On : December 18, 2024 / 05:29 PM IST

    Pushpa 2 The Rule Movie New Song release

    Follow us on

    Pushpa 2 The Rule : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద స్టడీ రన్ తో ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తెలుగు వెర్షన్ వసూళ్లు బాగా తగ్గిపోయాయి కానీ, హిందీ వెర్షన్ వసూళ్లు మాత్రం అసలు తగ్గేదేలే అనే విధంగా ముందుకు దూసుకుపోతుంది. వర్కింగ్ డేస్ లో బాలీవుడ్ నుండి ఒక సినిమాకి రోజుకి 30 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రావడం అనేది కేవలం పుష్ప 2 కి మాత్రమే చూస్తున్నాం అంటూ అక్కడి ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈరోజుటితో ఈ చిత్రం హిందీ వెర్షన్ వసూళ్లు 600 కోట్ల రూపాయిల నెట్ వసూళ్ల మార్కుని దాటేసింది. ఈ వీకెండ్ తో షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ చిత్ర వసూళ్లను దాటేస్తుందని అక్కడి ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వీడియో ని కాసేపటి క్రితమే మూవీ టీం విడుదల చేసింది.

    ‘పుష్ప..పుష్ప’ సాంగ్ లో అల్లు అర్జున్ చిన్న పిల్లలకు క్రికెట్ టౌర్మెంట్ నిర్వహిస్తుండగా, పిల్లలందరూ పుష్ప గెటప్స్ వేసుకొని పుష్ప మ్యానరిజమ్స్ ని అనుకరిస్తూ చాలా ఫన్నీ గా డ్యాన్స్ చేస్తారు. వీళ్ళతో కలిసి అల్లు అర్జున్ కూడా డ్యాన్స్ చేస్తాడు. ఈ షాట్ చూసేందుకు చాలా ఫన్నీ గా అనిపించింది. దీనిని చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసలు ఈ షాట్ ఇంత బాగుంటే ఎందుకు సినిమా నుండి తీసేశారంటూ సోషల్ మీడియా లో మేకర్స్ ని ట్యాగ్ చేసి విరుచుకుపడుతున్నారు. ఇలాంటి ఎన్నో చూడని సన్నివేశాలను, షాట్స్ ని ఓటీటీ వెర్షన్ లో జత చేసి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ఓటీటీ లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.

    ఇదంతా పక్కన పెడితే ‘పుష్ప 2’ చిత్రం ఈ వారం తో ప్రతిష్టాత్మక 1500 కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి అడుగుపెట్టబోతుంది. ఇప్పటి వరకు కేవలం బాహుబలి 2 , దంగల్ చిత్రాలు మాత్రమే ఈ మార్కుని దాటాయి. రాజమౌళి కూడా తన సినిమాని తాను క్రాస్ చేయలేకపోయాడు. కానీ ‘పుష్ప 2’ లాంటి ఒక మామూలు కమర్షియల్ చిత్రం అవలీల గా 1500 కోట్ల రూపాయిల మార్కుని దాటడం ట్రేడ్ పండితులను సైతం విస్వయానికి గురి చేసిన విషయం. ఈ వీకెండ్ కూడా బలమైన వసూళ్లను సొంతం చేసుకొని, ఫుల్ రన్ లో కచ్చితంగా 2000 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకోవాలని టాలీవుడ్ ట్రేడ్ పండితులు బలంగా కోరుకుంటున్నారు. అదే కనుక జరిగితే ఇండియా లోనే అన్ని భాషలకు కలిపి అత్యధిక వసూళ్లను రాబట్టిన నెంబర్ 1 చిత్రంగా పుష్ప 2 నిలుస్తుందని అంటున్నారు. మరి ఆ మార్కుని చేరుకుంటుందా లేదా అనేది చూడాలి.