Vijay Devarakonda: డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘లైగర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అందుకే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్ వచ్చేసింది. లైగర్ నుంచి మరో పాట విడుదలైంది. ఆఫత్ అంటూ సాగే ఈ పాటలో విజయ్ దేవరకొండ- అనన్యపాండేల కెమిస్ట్రీ యూత్ ని బాగా ఆకర్షించేలా ఉంది. ముఖ్యంగా ఈ పాట ఫుల్ వీడియోను షేర్ చేస్తూ..’మోస్ట్ రొమాంటిక్ సాంగ్ ఆఫ్ ద ఇయర్’గా విజయ్ చెప్పుకొచ్చాడు.

Also Read:Bimbisara – Sita Ramam: సీతారామం, బింబిసార పేరు గొప్ప ఊరు దిబ్బ ఎందుకు? కారణం ఏమిటి?
ఇక ‘లైగర్’ సినిమాకు సెన్సార్ పనులు కూడా పూర్తీ అయిపోయాయి. ఈ సినిమాకు U/A సర్టిఫికేట్‌ను అందించారు. సినిమా రన్‌టైమ్ 2 గంటల 20 నిమిషాలు. ఇక సినిమా చూసిన తర్వాత సెన్సార్ బోర్డ్ సభ్యులు సినిమా బాగుందని మెచ్చుకున్నారని టాక్. ఈ సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ తన కెరీర్ లో కీలకమైన రెండేళ్ళ సమయాన్ని పూర్తిగా ‘లైగర్’ సినిమాకే కేటాయించాడు. పూరి కూడా ఒక సినిమా కోసం ఈ స్థాయిలో ఎప్పుడూ సమయాన్ని కేటాయించలేదు. అందుకే విజయ్ దేవరకొండ ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. కాగా విజయ్ కి సినిమా చాలా బాగా నచ్చిందట. సినిమా అద్భుతంగా వచ్చిందని, కచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ లో సినిమా సూపర్ హిట్ అవుతుందని విజయ్ ధీమాగా ఉన్నాడు.

Also Read: Tollywood Hit Formula: టాలీవుడ్ హిట్ ఫార్ములా: తప్పు ప్రేక్షకులది కాదు.. సినీ మేకర్స్ దేనా?
అన్నిటికీ మించి దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. పైగా బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్, ఛార్మి, పూరి జగన్నాథ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.అందుకే హిందీలో కూడా లైగర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన కరుణ్ జోహార్ ఈ చిత్రాన్ని హిందీలో ఓన్ గా రిలీజ్ చేస్తున్నాడు.మిగిలిన అన్ని దక్షిణాది రాష్ట్రాలలో వరంగల్ శ్రీను రిలీజ్ చేయబోతున్నాడు.

క్రమంలో వరంగల్ శ్రీను షాకింగ్ రేట్ కి లైగర్ దక్షిణాది రాష్ట్రాల థియేటర్ రైట్స్ కొనుక్కున్నాడు. ఏకంగా 70 కోట్లకు లైగర్ రైట్స్ కొన్నాడు వరంగల్ శ్రీను. ఆంధ్ర ఏరియాను 30 కోట్ల రేషియోలో కొన్నాడు. వైజాగ్ ఏరియాను మాత్రం దర్శకుడు కొరటాల శివ సన్నిహితుడు సుధాకర్ 7 కోట్లకు కొన్నాడు. అలాగే ఈస్ట్ గోదావరి ఏరియాను డిస్ట్రిబ్యూటర్ భరత్ చౌదరి 4 కోట్లకు కొన్నాడు. మొత్తానికి లైగర్ సినిమాకి ఊహించని విధంగా బిజినెస్ జరుగుతుంది.