https://oktelugu.com/

Samantha And Keerthy Suresh: సమంత, కీర్తి సురేష్ వంటి హీరోయిన్స్ వద్ద వందల కోట్లు దోచేసిన వ్యక్తి అరెస్ట్..అసలు ఏమైందంటే!

మరో ఇద్దరు క్రేజీ యంగ్ హీరోయిన్స్ ని కూడా ఇతను ఇటీవలే సంప్రదించాడని, మేము అరెస్ట్ చేయకపోయుంటే వాళ్ళని కూడా ఇలాగే నమ్మించి మోసం చేసేవాడని చెప్పుకొచ్చారు జూబ్లీ హిల్స్ పోలీసులు. ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంటే కానీ సమంత, కీర్తి సురేష్ స్థాయి స్టార్ హీరోయిన్లు ఇలాంటోళ్లను నమ్మరు.

Written By:
  • Vicky
  • , Updated On : December 1, 2024 / 05:47 PM IST

    Samantha And Keerthy Suresh

    Follow us on

    Samantha And Keerthy Suresh: ప్రముఖ హీరోయిన్స్ సమంత, కీర్తి సురేష్ లతో పాటు ఎంతోమంది ప్రముఖులను మోసగించిన తృతీయా జ్యులరీ అధినేత కాంతి దత్ ని హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్ట్ చేసారు. సస్టైన్ కార్ట్ అనే సంస్థని ఇటీవలే స్థాపించిన ఈయన శిల్పా రెడ్డి అనే అమ్మాయితో భారీ పెట్టుబడులు తన సంస్థపై పెట్టించాడు. ఆమె వద్ద నుండి సుమారుగా వంద కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టించిన ఈయన, ఎలాంటి రాబడి చూపించలేదు. కనీసం శిల్పా రెడ్డి కి ఈయన అందుబాటులోకి లేకపోవడం, ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయకపోవడం, నేరుగా ఆఫీస్ కి వెళ్లి డబ్బులు అడిగితే దురుసుగా ప్రవర్తించడం వంటివి చేయడంతో, తనని డబ్బులు తీసుకొని మోసం చేశాడంటూ శిల్పా రెడ్డి పోలీస్ కేసు వేయగా, నేడు కాంతి దత్ ని అరెస్ట్ చేసారు. ఇతన్ని విచారిస్తుండగా ప్రముఖ హీరోయిన్లు సమంత, కీర్తి సురేష్, పరిణీతి చోప్రా వంటి హీరోయిన్స్ వద్ద కూడా ఇతను ఇలాగే మాటలు చెప్పి కోట్ల రూపాయిలు దోచేశాడని తెలిసింది.

    మరో ఇద్దరు క్రేజీ యంగ్ హీరోయిన్స్ ని కూడా ఇతను ఇటీవలే సంప్రదించాడని, మేము అరెస్ట్ చేయకపోయుంటే వాళ్ళని కూడా ఇలాగే నమ్మించి మోసం చేసేవాడని చెప్పుకొచ్చారు జూబ్లీ హిల్స్ పోలీసులు. ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంటే కానీ సమంత, కీర్తి సురేష్ స్థాయి స్టార్ హీరోయిన్లు ఇలాంటోళ్లను నమ్మరు. కానీ అంత తేలికగా ఇతన్ని వీళ్ళు ఎలా నమ్మారు అని సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ విషయంలోనే ఇతను ఈ విధంగా ప్రవర్తిస్తే, ఇక సామాన్యుల విషయం లో ఎంత దారుణంగా వ్యవహరించి ఉంటాడో, ఎన్ని వందల కోట్ల రూపాయిలు దోచేసి ఉంటాడో, ఇతన్ని ఊరికే వదలొద్దు, తీసుకున్న డబ్బులు మొత్తం ఇతని నుండి వెనక్కి వచ్చేలా చేయండి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.

    సమంత, కీర్తి సురేష్ వంటి వారు ఒక్కో యాడ్ కి రెండు నుండి మూడు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్స్ తీసుకునే సంగతి తెలిసింది. సౌత్ లో వీళ్లిద్దరి డేట్స్ కోసం దర్శక నిర్మాతలు, స్టార్ హీరోలు ఎంతలా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలుసు. అలాంటి సూపర్ స్టార్స్ ని బురిడీ కొట్టించాడంటే కాంతి దత్ తెలివితేటలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. ఇంతకు ఇతను ఇంతమంది నుండి దోచేసిన డబ్బుని ఏమి చేసాడు ..?,అసలు ఏ ఉద్దేశ్యంతో తీసుకున్నాడు?, తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదని ఇతని మీద ఇలాంటి కేసు వేసారా?, లేకపోతే నిజంగానే వ్యాపార ఆశ చూపించి డబ్బులు దోచుకున్నాడా అనేది తెలియాల్సి ఉంది. వాళ్ళు ఇచ్చిన డబ్బులు వ్యాపారంలో పెట్టి నష్టపోయి, డబ్బులు తిరిగి కట్టలేని పరిస్థితి కూడా వచ్చి ఉండొచ్చు. అసలు ఏమి జరిగింది అనేది పూర్తి స్థాయి వాస్తవాలు త్వరలోనే బయటకి రానున్నాయి.