OG Theatrical Trailer: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘ఓజీ'(They Call Him OG) థియేట్రికల్ ట్రైలర్ కి సంబంధించిన అప్డేట్ కాసేపటి క్రితమే సోషల్ మీడియా ద్వారా అధికారికంగా తెలిపారు మేకర్స్. ఈ సినిమా కోసం కేవలం పవన్ అభిమానులు మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సినిమా నుండి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ అలాంటిది మరి. అయితే ఫాన్స్ ట్రైలర్ విషయం లో చాలా ఆలస్యం చేసారని మేకర్స్ పై ఫుల్ ఫైర్ మీద ఉన్నారు. సినిమా వారం రోజుల్లో విడుదల పెట్టుకొని, ఇంకా థియేట్రికల్ ట్రైలర్ గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేస్తూ ట్విట్టర్ లో నిర్మాతలను ట్యాగ్ చేసి బూతులు తిట్టడం మొదలు పెట్టారు. ఫ్యాన్స్ ఆవేశాన్ని మేకర్స్ అర్థం చేసుకున్నట్టు ఉన్నారు, ట్రైలర్ ని ఈ నెల 21 న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా తెలిపారు.
అంతే కాదు సినిమా కంటెంట్ కి సంబంధించిన వర్క్ మొత్తం పూర్తి అయ్యింది అట. నేడు రాత్రి ఓవర్సీస్ కి ప్రింట్స్ మొత్తం పంపించేందుకు రంగం సిద్ధం చేశారట మేకర్స్. అదే విధంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా 21 వ తేదీనే ప్లాన్ చేసినట్టు సమాచారం. హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పెరేడ్ గ్రౌండ్స్ లేదా LB స్టేడియం లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేసే పని లో ఉన్నారు. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి ఒక మూవీ ఈవెంట్ లో పాల్గొనడం జరిగి చాలా కాలమే అయ్యింది. మళ్లీ వీళ్ళిద్దరిని ఒకే వేదిక పై చూడబోతున్నందుకు అభిమానుల్లో ఆనందం మామూలు రేంజ్ లో లేదు.
ఇకపోతే సుజిత్ మూవీ ట్రైలర్స్ ఎలా ఉంటాయో మనం గతం లో చాలానే చూసాము. ముఖ్యంగా సాహూ చిత్రానికి ఆ రేంజ్ హైప్ క్రియేట్ అవ్వడానికి ప్రధాన కారణం థియేట్రికల్ ట్రైలర్. ఈ సినిమాకు కూడా అదే రేంజ్ ట్రైలర్ ని ప్లాన్ చేసి ఉంటాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే ఓవర్సీస్ లో రికార్డు బ్రేకింగ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. థియేట్రికల్ ట్రైలర్ తర్వాత బుకింగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించడానికే కష్టమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఈ వీకెండ్ లోనే రెండు తెలుగు రాష్ట్రాల అడ్వాన్స్ బుకింగ్స్ ని కూడా ప్రారంబిస్తారట మేకర్స్. చూడాలి మరి ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది అనేది.