OG’ Makers vs Hari Hara Veeramallu’ Makers : ఓజీ’ మేకర్స్ పై మండిపడ్డ ‘హరి హర వీరమల్లు’ మేకర్స్..ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ నిర్మాతల మధ్య అంతర్యుద్ధం!

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల కొంతకాలం ఈ రెండు సినిమాల షూటింగ్స్ తాత్కాలికంగా నిలిచిపోయాయి. 70 శాతం కి పైగా షూటింగ్స్ ని పూర్తి చేసుకున్న ఈ రెండు సినిమాలకు సంబంధించిన మిగిలిన షూటింగ్స్ ని పూర్తి చేయడానికి ఆయన రీసెంట్ గానే కాల్ షీట్స్ అందించాడు.

Written By: Vicky, Updated On : October 20, 2024 6:55 pm

OG' Makers vs Hari Hara Veeramallu' Makers

Follow us on

OG’ Makers vs Hari Hara Veeramallu’ Makers :  రీ ఎంట్రీ తర్వాత పవన్ కళ్యాణ్ వరుసగా మూడు రీమేక్ సినిమాలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన తోటి హీరోలందరూ వరుసగా భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతుంటే, మా హీరో మాత్రం రీమేక్స్ తో సరిపెడుతున్నాడని, త్రివిక్రమ్ మధ్యలో దూరి మా అభిమాన నటుడి కెరీర్ ని నాశనం చేస్తున్నాడని, ఇలా సోషల్ మీడియా లో అభిమానులు తమ అసహనం ని వ్యక్తపరిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే అభిమానుల బాధని అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’, ‘ఓజీ’ లాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలను సెట్ చేసాడు. ఈ రెండు సినిమాలకు అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా?, ఎప్పుడెప్పుడు రికార్డ్స్ పెడుదామా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల కొంతకాలం ఈ రెండు సినిమాల షూటింగ్స్ తాత్కాలికంగా నిలిచిపోయాయి. 70 శాతం కి పైగా షూటింగ్స్ ని పూర్తి చేసుకున్న ఈ రెండు సినిమాలకు సంబంధించిన మిగిలిన షూటింగ్స్ ని పూర్తి చేయడానికి ఆయన రీసెంట్ గానే కాల్ షీట్స్ అందించాడు. ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్ లో గత రెండు వారాల నుండి పాల్గొంటున్న పవన్ కళ్యాణ్, ఈ నెలాఖరుతో తనకి సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేయబోతున్నాడు. ఇక ఆ తర్వాత నవంబర్ మొదటి వారం నుండి ఆయన ‘ఓజీ’ మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. రెండు సినిమాలు ఒకే సమయంలో పూర్తి అవ్వబోతున్న ఈ నేపథ్యం లో, రెండు చిత్రాల అప్డేట్స్ ఏకకాలం లో వస్తున్నాయి. దీంతో నిన్న రాత్రి ట్విట్టర్ లో ఇరు సినిమాలకు సంబంధించిన నిర్మాతల మధ్య చిన్న క్లాష్ ఏర్పడింది. ముందుగా ‘ఓజీ’ చిత్రానికి సంబంధించిన ఒక చిన్న పోస్టర్ ని మేకర్స్ వదులుతూ మీ కవర్ పిక్ గా పెట్టుకోండి అని చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియా మొత్తం ఓజీ మేనియా తో ఊగిపోయింది. ఈ రెండు సినిమాలలో ముందుగా వస్తున్నది ‘హరి హర వీరమల్లు’. వచ్చే ఏడాది మార్చి 28వ తారీఖున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఓజీ కి సంబంధించిన అప్డేట్స్ ఇచ్చినప్పుడల్లా ఆ మేనియా తో సోషల్ మీడియా ఊగిపోతుందని, హరి హర వీరమల్లు ని అభిమానులు పట్టించుకోవడం లేదని , కొంతమంది అభిమానులు బాధపడ్డారు. సరిగ్గా అదే సమయంలో ‘హరి హర వీరమల్లు’ మేకర్స్ కూడా గ్లిమ్స్ వీడియో ని అప్లోడ్ చేస్తూ ఓజీ మేకర్స్ కి పరోక్షంగా సవాలు విసిరారు. అలా వీళ్లిద్దరి మధ్య నిన్న రాత్రి మొత్తం కోల్డ్ వార్ జరిగింది. ఇదంతా పక్కన పెడితే ఈ నెలాఖరున దీపావళి సందర్భంగా ‘హరి హర వీరమల్లు’ నుండి పవన్ కళ్యాణ్ పాడిన పాటను విడుదల చేయబోతున్నారట, త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతుంది.