https://oktelugu.com/

Brow the Avatar : ‘బ్రో ది అవతార్’ ట్రైలర్ ని ప్రదర్శించే థియేటర్స్ లిస్ట్ వచ్చేసింది..ఫ్యాన్స్ కి ఇక పండగే!

ట్రైలర్ ని రేపు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారట.

Written By:
  • Vicky
  • , Updated On : July 21, 2023 / 04:50 PM IST
    Follow us on

    Brow the Avatar : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘బ్రో ది అవతార్’ అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని మరో వారం రోజుల్లో మన ముందుకి రాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని రేపు గ్రాండ్ గా విడుదల చెయ్యబోతున్నారు. చాలా కాలం నుండి ఈ సినిమా ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

    వాళ్ళ ఎదురు చూపులకు తెరదించుతూ 22 వ తారీఖున ట్రైలర్ ని విడుదల చెయ్యబోతున్నట్టు నిన్న రాత్రి ఒక అదిరిపోయే స్టైలిష్ పోస్టర్ ద్వారా అభిమానులకు తెలిపారు. అయితే ఈ ట్రైలర్ కి సంబంధించి అభిమానులు ఎగిరి గంతులు వేసే వార్త ఒకటి బయటకి వచ్చింది. అదేమిటంటే ఈ ట్రైలర్ ని రేపు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారట. ఏ సమయం లో రిలీజ్ చేస్తారో తెలియదు కానీ ఇది అయితే ఖరారు అయ్యింది.

    ఇప్పటి వరకు ఖరారైన థియేటర్స్ లిస్ట్ ని ఒకసారి పరిశీలిస్తే హైదేరాబద్ లోని ఆర్టీసీ క్రాస్ లో ఉండే పాపులర్ థియేటర్ దేవి 70 ఏంఏం లో ఈ ట్రైలర్ ని ప్రదర్శించబోతున్నారట. అలాగే వైజాగ్ లో జగదాంబ థియేటర్, గుంటూరు లో భాస్కర్ థియేటర్, భీమవరం లో విజయలక్ష్మి థియేటర్, తెనాలి లో సంగమేశ్వరా థియేటర్స్ ఖరారు.

    ఇంకా ప్రతీ జిల్లాలోనూ ట్రైలర్ కి సంబంధించిన థియేటర్స్ చార్ట్ ని అతి త్వరలోనే విడుదల చేయబోతుంది మూవీ టీం. గతం లో పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాకి ఇలాగే చేసారు. థియేటర్స్ నుండి ఈ ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ ని చూసి పాన్ ఇండియా మొత్తం షేక్ అయ్యింది. ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. ఆ స్థాయిలో ట్రైలర్ కి రెస్పాన్స్ రావడం అనేది గతం లో ఎప్పుడూ కూడా జరగలేదు, చరిత్ర లో అదే తొలిసారి. మళ్ళీ అదే రేంజ్ రెస్పాన్స్ ని ‘బ్రో ది అవతార్’ ట్రైలర్ కి కూడా వస్తుందని ఆశిస్తున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి.