https://oktelugu.com/

Mufasa The Lion King : ఓటీటీ లోకి వచ్చేసిన ‘ముఫాసా..ది లయన్ కింగ్’..తెలుగు వెర్షన్ ఇందులో చూడాలంటే!

గత ఏడాది డిసెంబర్ 20వ తారీఖున విడుదలైన హాలీవుడ్ లైవ్ యానిమేషన్ చిత్రం 'ముఫాసా : ది లయన్ కింగ్' ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసుకుందో మనమంతా చూసాము.

Written By:
  • Vicky
  • , Updated On : February 6, 2025 / 04:49 PM IST
    Mufasa The Lion King

    Mufasa The Lion King

    Follow us on

    Mufasa The Lion King : గత ఏడాది డిసెంబర్ 20వ తారీఖున విడుదలైన హాలీవుడ్ లైవ్ యానిమేషన్ చిత్రం ‘ముఫాసా : ది లయన్ కింగ్’ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసుకుందో మనమంతా చూసాము. తెలుగులో ఈ ముఫాసా క్యారక్టర్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించడం, కేవలం మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించాడు అనే కారణం చేత ఈ చిత్రానికి తెలుగులో బంపర్ ఓపెనింగ్స్ రావడం వంటివి మనం చూసాము. మహేష్ అభిమానులు ఈ సినిమా విడుదల రోజు థియేటర్స్ వద్ద చేసిన హంగామా అంతా ఇంతా కాదు. వాటికి సంబంధించిన వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఆ రేంజ్ లో ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లాడు. కేవలం తెలుగు వెర్షన్ నుండే ఈ సినిమాకి 15 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

    ఓవర్సీస్ లో కూడా తెలుగు వెర్షన్ కి డీసెంట్ స్థాయి వసూళ్లు వచ్చాయి. హాలీవుడ్ మూవీస్ తెలుగు లో డబ్ అయ్యి ఓవర్సీస్ లో విడుదల అవ్వడం ఇదే తొలిసారి. ఓపెనింగ్స్ నుండి క్లోజింగ్ వరకు ఈ చిత్రం ఓవర్సీస్ లో లక్ష డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. హిందీ వెర్షన్ లో ‘ముఫాసా’ క్యారక్టర్ కి షారుఖ్ ఖాన్ డబ్బింగ్ చెప్పాడు. హిందీ వెర్షన్ కూడా ఓవర్సీస్ లో విడుదలైంది. కానీ కనీస స్థాయిలో కూడా వసూళ్లను రాబట్టలేదు. దీనిని బట్టి ఓవర్సీస్ లో మహేష్ బాబు కి ఎలాంటి కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 3200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని డిస్నీ + హాట్ స్టార్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఓటీటీ ఆడియన్స్ కి ఒక శుభవార్త.

    ఈ చిత్రం ఫిబ్రవరి 18 వ తారీఖు నుండి డిస్నీ + హాట్ స్టార్ లో అన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి రానుంది. కానీ ఉచితంగా చూడలేము. రెంటల్ బేసిస్ మీద మాత్రమే చూడగలము. ఏప్రిల్ 1 నుండి ఉచితంగా చూడొచ్చు. ఆ ఉచితం కూడా హాట్ స్టార్ లో డబ్బులు పెట్టి సబ్ స్క్రైబ్ చేసుకున్న యూజర్లకు మాత్రమే. అమెరికన్ థియేటర్స్ లో ఇప్పటికీ ఈ చిత్రం విజయవంతంగా నడుస్తూనే ఉంది. హాలీవుడ్ చిత్రాలకు సూపర్ హిట్ టాక్ వస్తే సంవత్సరాలు తరబడి ఆడినవి కూడా ఉన్నాయి. అవతార్ సిరీస్, మార్వెల్ మూవీస్ అదే విధంగా థియేటర్స్ లో ఆడాయి. మరి థియేటర్స్ లో అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం, ఓటీటీ ఆడియన్స్ ని ఎంతమేరకు సంతృప్తి పరచగలదో చూడాలి. తెలుగు వెర్షన్ తో పాటు హిందీ వెర్షన్ ని కూడా ఇందులోనే చూడొచ్చు.