Double Ismart: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒక కమర్షియల్ సినిమా అనేది ఏ స్టాండర్డ్ లో ఉండాలి అనేదానికి ఈతరం డైరెక్టర్ లలో ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది పక్కాగా పూరి జగన్నాథ్ అనే చెప్పాలి. ఒక సినిమా ఎలా తీస్తే హిట్ అవుతుంది, ఎవరిని టార్గెట్ చేసి డైలాగులు రాయాలి, ఫ్యామిలీ ఆడియన్స్ చేత క్లాప్స్ ఎలా కొట్టించాలి అనేది పూరి జగన్నాథ్ కి తెలిసినంత గొప్పగా మరే డైరెక్టర్ కి తెలియదు.
అందుకే ఆయన ఒకానొక టైంలో వరుసగా హిట్ సినిమాలు తీసి ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు. ఇక ప్రస్తుతం రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సిక్వల్ గా డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఆయన ఒక భారీ హిట్ కొట్టాలి అనే కాన్సెప్ట్ తో మన ముందుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమా స్టోరీ ఇప్పుడు లీక్ అయిందంటూ చాలా వార్తలు అయితే వస్తున్నాయి.ఇక ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ ఏంటి అనేది మనం కూడా ఒకసారి తెలుసుకుందాం…
ఇస్మార్ట్ శంకర్ సినిమా తరహా లోనే ఈ సినిమా స్టోరీ కూడా చాలా కామెడీ గా ఉంటూనే, మాస్ ఎలెమెంట్స్ తో ఉండనున్నట్టుగా తెలుస్తుంది.ఇక రామ్ బ్రెయిన్ లో పెట్టిన చిప్ ద్వారా పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉన్న మరికొన్ని కేసులను హ్యాండిల్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.ఒక డాన్ కి సంబందించిన మొత్తం డేటా ని పోలీస్ లకి పట్టించడానికి పోరాటం చేసే క్యారెక్టర్ లో రామ్ కనిపిస్తాడు…ఇక అందులో భాగంగానే రామ్ ముంబైలో ఒక అండర్ వరల్డ్ డాన్ తో యుద్దానికి దిగపోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక వీళ్లిద్దరిలో ఎవరిది పై చేయి అవుతుంది అనే దాని మీదనే ఈ సినిమా స్టోరీ నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ కి చెందిన సంజయ్ దత్ కూడా ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఆయన పాత్ర కూడా ఈ సినిమాకి చాలా కీలకం అనే విషయాలైతే చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. ఇక ఈ సినిమా స్టోరీ మొత్తం ముంబై డాన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఇప్పటికే పూరి ఇలాంటి స్టోరీలు చాలా తీసినప్పటికీ ఈ సినిమాని సరికొత్త మేకింగ్ తో, కొన్ని ట్విస్ట్ లతో మన ముందుకు తీసుకురాబోతున్నట్టుగా ఫిలింనగర్ సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఈ సినిమాతో పూరి మరోసారి తన స్టామినా ఏంటో చూపించుకోవడానికి రెడీ అవుతున్నాడు. పూరి గత చిత్రమైన లైగర్ సినిమా భారీ డిజాస్టర్ అవడంతో పూరి ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది.ఇక దాన్ని దృష్టిలో ఉంచుకొనే ఈ సినిమాతో మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలని కోరుకుంటున్నాడు ఆయన అనుకున్నట్టుగానే ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేదా అనేది తెలియాలి అంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయక తప్పదు…