Hari Hara Veeramallu : పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాలలో అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా అమితాసక్తితో ఎదురు చూస్తున్న వాటిల్లో ఒకటి ‘హరి హర వీరమల్లు’. పీరియాడిక్ జానర్ లో సుమారుగా 300 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే 90 శాతం కి పైగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. కేవలం పవన్ కళ్యాణ్ కి సంబంధించి వారం రోజుల కాల్ షీట్స్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. ప్రస్తుతం ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఎంత బిజీగా ఉన్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. అందుకే ఈ వారం రోజుల డేట్స్ ని సర్దుబాటు చేయడానికి ప్రస్తుతానికి ఆయనకు కష్టం అవుతుంది. వచ్చే నెలలో ఆయన డేట్స్ కేటాయించే అవకాశాలు ఉన్నాయి. అన్ని అనుకున్న విధంగా ఆయన డేట్స్ ని కేటాయించి, సినిమా షూటింగ్ ని పూర్తి చేస్తే మార్చి 28 న ఈ చిత్రం మన ముందుకు వచ్చేస్తుంది.
ఇది ఇలా ఉండగా ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ‘ఔరంగజేబ్’ క్యారక్టర్ చేస్తున్న సంగతి తెలిసిందే. టీజర్ లో ఇప్పటికే ఆయన క్యారక్టర్ లుక్ ఎలా ఉంటుంది అనే దానిపై అభిమానులకు, ప్రేక్షకులకు ఒక క్లారిటీ వచ్చింది. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ పోస్టర్ లో బాబీ డియోల్ లుక్స్ కి, ఆయన కాస్ట్యూమ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ గెడ్డం మాత్రం ఔరంగజేబుకి ఉన్నట్టుగా లేదని అందరూ అనుకుంటున్నారు. ఇదొక్క మైనస్ తప్ప ఇంకేమి లేదని, పోస్టర్ క్వాలిటీ కూడా చాలా బాగుందని అంటున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ పాత్ర పోషిస్తున్నాడు. నవాబులపై ఆయన దక్షిణ భారత దేశం నుండి ఉత్తర భారత దేశం వరకు దండయాత్ర చేస్తూ ప్రయాణమే ఈ సినిమా స్టోరీ.
రీసెంట్ గానే ఈ సినిమాలోని మొదటి పాటగా ‘మాట వినాలి’ విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన ఈ పాటకు యూట్యూబ్ లో ఇప్పటి వరకు 28 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఫిబ్రవరి 14 న రెండవ పాటని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పూజిత పొన్నాడ, అనసూయ లతో కలిసి పవన్ కళ్యాణ్ చిందులేసిన ఈ గ్రాండియర్ సాంగ్ అభిమానులకు విజువల్ ఫీస్ట్ లాగా ఉండబోతుందట. సుమారుగా 500 మంది డ్యాన్సర్లు ఈ పాటలో కనిపిస్తారట. ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఈ పాటకు కొరియోగ్రఫీ చేసాడు. రీసెంట్ గా ఆయన ‘గేమ్ చెంజర్ ‘, ‘పుష్ప 2 ‘ చిత్రాలకు పని చేసాడు. ఈ పాట లిరికల్ వీడియో విడుదలైన తర్వాత సినిమాపై హైప్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్తుందని అంటున్నారు.