https://oktelugu.com/

Ileana Baby Bump Photos: మొదటిసారి కెమెరా ముందుకు వచ్చిన పెళ్లి కాని తల్లి ఇలియానా… బేబీ బంప్ చూపుతూ!

ఇలియానాకు పెళ్లి కాలేదు. అలాగే ఎవరితోనూ రిలేషన్ ప్రకటించలేదు. ఆస్ట్రేలియన్ బాయ్ ఫ్రెండ్ తో ఆమెకు బ్రేకప్ అయ్యి చాలా కాలం అవుతుంది. దీంతో ఇలియానా గర్భానికి కారకులు ఎవరనే చర్చ నడుస్తుంది.

Written By: , Updated On : May 13, 2023 / 11:27 AM IST
Ileana Baby Bump Photos

Ileana Baby Bump Photos

Follow us on

Ileana Baby Bump Photos: భారతీయ సమాజం బాగా మారిపోయింది. పెళ్ళికి ముందు శృంగారం, తల్లి కావడం పెద్ద మేటర్ కాదన్నట్లు తయారైంది. అందుకు ఆడవాళ్ళేమీ సిగ్గుపడటం లేదు. సెలెబ్రిటీలు ఇప్పుడిదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. అలియా భట్ ప్రియుడు రన్బీర్ కపూర్ తో పెళ్ళికి ముందే తల్లయ్యారు. గర్భం దాల్చిన అనంతరం పెళ్లి చేసుకున్నారు. మరికొందరు ఈ లిస్ట్ లో ఉన్నారు. అలియా భట్ గర్భవతిని చేసింది ఎవరో కనీసం అవగాహన ఉంది. ఇలియానా అసలు సస్పెన్సులో పెట్టి చంపేస్తుంది. ఇలియానా ఇటీవల తాను గర్భం దాల్చినట్లు సంచలన ప్రకటన చేశారు.

ఇలియానాకు పెళ్లి కాలేదు. అలాగే ఎవరితోనూ రిలేషన్ ప్రకటించలేదు. ఆస్ట్రేలియన్ బాయ్ ఫ్రెండ్ తో ఆమెకు బ్రేకప్ అయ్యి చాలా కాలం అవుతుంది. దీంతో ఇలియానా గర్భానికి కారకులు ఎవరనే చర్చ నడుస్తుంది. ఆమె మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఈ క్రమంలో అనేక పుకార్లు తెరపైకి వచ్చాయి. ఇలియానా స్పందించలేదు. ఇక తల్లి అయ్యాక మొదటిసారి ఇలియానా తన బేబీ బంప్ రివీల్ చేశారు. బ్లాక్ ట్రెండీ వేర్లో ఆమె గర్భం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

ఈ ఫోటోలకు ‘బంప్ అలర్ట్’ అని ఇలియానా కామెంట్ పెట్టారు. ఇలియానా బేబీ బంప్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇలియానా తనను తల్లిని చేసింది ఎవరనేది చెప్పకున్నా… ఒకరి పేరు ప్రముఖంగా వినిస్తోంది. స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ బ్రదర్ సెబాస్టియన్ లారెంట్ మైకేల్ కారణంగా ఇలియానా గర్భవతి అయ్యారనే ప్రచారం జరుగుతుంది. కొన్నాళ్లుగా వీరిద్దరూ సన్నిహితంగా ఉంటున్నారు. ఈ క్రమంలో అతనితో డేటింగ్ చేస్తున్న ఇలియానా తల్లి అయ్యారంటున్నారు.

ఇక ఇలియానా కెరీర్ పరిశీలిస్తే ఆమెను టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేసింది. దర్శకుడు వైవిఎస్ చౌదరి తెరకెక్కించిన దేవదాసు మూవీతో ఆమె హీరోయిన్ అయ్యారు. రెండో మూవీకే మహేష్ బాబు పక్కన ఛాన్స్ కొట్టేసింది. పోకిరి ఇండస్ట్రీ హిట్ కావడంతో ఇలియానా ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. సౌత్ ఇండియాలో ఇలియానా స్టార్ లేడీగా వెలిగిపోయారు. కెరీర్ పీక్స్ లో ఉండగా ఇలియానా బాలీవుడ్ వైపు అడుగులు వేశారు. ఈ నిర్ణయం ఆమెను తీవ్రంగా దెబ్బతీసింది. ప్రస్తుతం హిందీలో అడపాదడపా చిత్రాలతో నెట్టుకొస్తోంది.