https://oktelugu.com/

Kurchi Thatha: మహేష్ బాబుకే డైలాగ్ అరువిచ్చిన ఈ కుర్చీ తాత ఎవరు? షాకింగ్ డిటైల్స్!

నేడు మూడో సాంగ్ ప్రోమో విడుదల చేశారు. సాంగ్ ప్రోమో చూసి అందరి మైండ్స్ బ్లాక్ అయ్యాయి. ఈ పాటలో లిరిక్స్ గా కుర్చీ తాత ఫేమస్ డైలాగ్ వాడారు. అసలు ఈ కుర్చీ తాత ఎవరు? ఆయన డైలాగ్ సూపర్ స్టార్ మహేష్ తన సాంగ్ లో పెట్టుకోవడం ఏంటనే? సందేహాలు అందరికీ ఉన్నాయి.

Written By:
  • NARESH
  • , Updated On : December 29, 2023 / 04:10 PM IST

    Kurchi Thatha

    Follow us on

    Kurchi Thatha: మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. మహేష్ బాబు తన పార్ట్ షూటింగ్ పూర్తి చేశారు. దుబాయ్ వెళ్లారు. అక్కడ ఓ యాడ్ షూట్ ఉన్నట్లు సమాచారం. త్వరలోనే తిరిగి రానున్న మహేష్ బాబు గుంటూరు కారం ప్రమోషన్స్ లో పాల్గొంటారు. విడుదల తేదీ దగ్గరపడుతుండగా ఒక్కో సాంగ్ విడుదల చేస్తున్నారు. గుంటూరు కారం నుండి ఫస్ట్ సింగిల్ ‘దమ్ మసాలా’, సెకండ్ సింగిల్ ‘ఓ బేబీ’ విడుదలయ్యాయి.

    నేడు మూడో సాంగ్ ప్రోమో విడుదల చేశారు. సాంగ్ ప్రోమో చూసి అందరి మైండ్స్ బ్లాక్ అయ్యాయి. ఈ పాటలో లిరిక్స్ గా కుర్చీ తాత ఫేమస్ డైలాగ్ వాడారు. అసలు ఈ కుర్చీ తాత ఎవరు? ఆయన డైలాగ్ సూపర్ స్టార్ మహేష్ తన సాంగ్ లో పెట్టుకోవడం ఏంటనే? సందేహాలు అందరికీ ఉన్నాయి. ఈ కుర్చీ తాత వివరాలు పరిశీలిస్తే… హైదరాబాద్ కృష్ణకాంత్ పార్క్ వద్ద ఖాళీగా ఉండే షేక్ మహ్మద్ పాషా వీడియో ఒకటి వైరల్ అయ్యింది.

    ఆ వీడియోలో తన పైకి కత్తితో వచ్చిన నా బావమరిది ని కుర్చీ మడతపెట్టి దెం*** మెడలు విరిగిపోయాయ్ అని అన్నాడు. ఈ డైలాగ్ జనాలకు తెగ నచ్చేసింది. విపరీతంగా వైరల్ అయ్యింది. దాంతో కుర్చీ తాతగా పాప్యులర్ అయ్యాడు. పదుల సంఖ్యలో యూట్యూబ్ ఛానల్స్ ఆయన్ని ఇంటర్వ్యూ చేశాయి. కుర్చీ తాత మాట తీరు చాలా రఫ్ గా ఉంటుంది. మాస్ హీరో రేంజ్ కి మించిన ఎలివేషన్ ఉంటుంది.

    ఎవడైతే నాకేంటి యాటిట్యూడ్. ఈ క్రమంలో పొలిటీషియన్స్, హీరోలను కూడా కుర్చీ తాత తిట్టాడు. ఆ కుర్చీ తాత చెప్పిన కుర్చీ మడతపెట్టి **** డైలాగ్ ని గుంటూరు కారం సాంగ్ లో మహేష్ బాబు వాడాడు. ఇది అతిపెద్ద చర్చకు దారి తీసింది. కాగా కుర్చీ తాత వారం రోజులగా కనిపించడం లేదట. ఆమె భార్య ఏడుస్తూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ని కలిసింది. వాళ్ళు కనుక్కునే ప్రయత్నం చేయగా వరంగల్ లో ఉన్నాడని తెలిసింది. కిడ్నాప్ అయ్యాడని ఆమె భార్య ఆందోళన పడింది. అయితే కథ సుఖాంతం అయ్యింది.