https://oktelugu.com/

Harihara Veeramallu: ‘హరిహర వీరమల్లు’ స్టోరీని లీక్ చేసిన హీరోయిన్.. వైరల్..!

Harihara Veeramallu’: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్లలో తెరకెక్కుతున్న చిత్రం  ‘హరిహర వీరమల్లు’. పవన్ కల్యాణ్ తొలిసారి హిస్టారికల్ మూవీలో నటిస్తుండటంతో ఈ సినిమాపై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ‘హరిహర వీరమల్లు’ను దర్శకుడు క్రిష్ భారీ బడ్జెట్లో విజువల్ వండర్ గా రూపొందిస్తున్నాడని తెలుస్తోంది. ఈ మూవీలో పవన్ కల్యాణ్ కు జోడిగా బ్యూటీఫుల్ హీరోయిన్ నిధి అగర్వాల్ నటిస్తోంది. ఇందులో ఆమె ‘పంచమి’ అనే పాత్రలో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 7, 2022 / 12:09 PM IST
    Follow us on

    Harihara Veeramallu’: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్లలో తెరకెక్కుతున్న చిత్రం  ‘హరిహర వీరమల్లు’. పవన్ కల్యాణ్ తొలిసారి హిస్టారికల్ మూవీలో నటిస్తుండటంతో ఈ సినిమాపై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ‘హరిహర వీరమల్లు’ను దర్శకుడు క్రిష్ భారీ బడ్జెట్లో విజువల్ వండర్ గా రూపొందిస్తున్నాడని తెలుస్తోంది.

    ఈ మూవీలో పవన్ కల్యాణ్ కు జోడిగా బ్యూటీఫుల్ హీరోయిన్ నిధి అగర్వాల్ నటిస్తోంది. ఇందులో ఆమె ‘పంచమి’ అనే పాత్రలో నటిస్తోంది. గతేడాది ఆమె పుట్టిన రోజు సందర్భంగా నిధి అగర్వాల్ క్యారెక్టర్ కు సంబంధించిన ఫస్ట్ లుక్కును చిత్ర బృందం విడుదల చేసి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన సంగతి తెల్సిందే. తాజాగా ఆమె ఓ ఇంటర్యూలో ‘హరిహర వీరమల్లు’కు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

    ‘హరిహర వీరమల్లు’లో పవన్ కల్యాణ్ పక్కన నటించడం అదృష్టంగా భావిస్తున్న నిధి అగర్వాల్ తెలిపింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో పవన్ నుంచి ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నట్లు చెప్పింది. అయితే ఈ మూవీ రెండు కాలాల మధ్య సాగుతుందంటూ అసలు కథను నిధి అగర్వాల్ రివీల్ చేసింది. దీంతో ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

    ఈ సినిమా పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్నప్పటికీ రెండు కాలాల మధ్య కథ సాగుతుందని అర్థమవుతోంది. దీంతో ఈ మూవీపై అభిమానులు పెట్టుకున్న అంచనాలు మారుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ కల్యాణ్ జెట్ స్పీడుతో సినిమాలను పూర్తి చేస్తూ ముందుకెళుతున్నారు. ఇటీవలే పవన్ కల్యాణ్ నటించిన ‘బీమ్లానాయక్’ షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు రెడీగా ఉంది.