Nagarjuna: కొన్ని సినిమాల్లో కొంతమంది హీరోలను, హీరోయిన్లను అనుకుంటాం… కానీ ఫైనల్ గా వాళ్ళు కాకుండా ఆ సినిమాని వేరే హీరో, హీరోయిన్లు చేసి మంచి సక్సెస్ ల అందుకుంటారు. కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ ని కూడా అందుకోవాల్సి వస్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ సినిమా లో అనుష్క చేసిన పాత్రకి కోసం మొదట వేరే హీరోయిన్ ని అనుకున్నారు.
ఆవిడ ఎవరు అంటే అప్పటికే ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందిన సోనాలి బింద్రే ని తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఆమె క్యారెక్టర్ కి నో చెప్పడంతో ముంబై నుంచి అనుష్క ని తీసుకొచ్చి ఆమె చేత ఈ క్యారెక్టర్ ని చేయించారు. దాంతో సినిమా ప్లాప్ అయినప్పటికీ అనుష్క చేసిన ఆ క్యారెక్టర్ కి మాత్రం మంచి పేరు రావడంతో అనుష్కకి వరుసగా తెలుగు సినిమాల్లో. అలాగే పెద్ద హీరోల పక్కన చేసే అవకాశాలు వచ్చాయి.
దాంతో ఆమె ఇండస్ట్రీలో ఒక్కసారి గా స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. ఇక ఇప్పటికి కూడా ఆమె తనకంటూ ఒక మంచి గుర్తింపు అయితే సంపాదించుకుంది. ఇక అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ వస్తున్నప్పటికీ అనుష్క ఫుల్ గా ఫ్లెడ్జ్ డ్ గా మాత్రం సినిమాలు చేయడం లేదు. దానికి కారణం ఆమె వెయిట్ ఎక్కువగా పెరగడమే అనే విషయం అయితే తెలుస్తుంది. ఇక సూపర్ సినిమాలో సోనాలి బింద్రే క్యారెక్టర్ మిస్ చేసుకోవడం వల్ల ఆ అవకాశాన్ని దక్కించుకున్న అనుష్క మాత్రం చాలా గొప్ప హీరోయిన్ గా ఎదిగిందనే చెప్పాలి. ఒకానొక సమయంలో అనుష్క హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేసి స్టార్ హీరోలకు సైతం పోటీ ఇచ్చిందనే చెప్పాలి.
హీరోలు లేకుండా సినిమాలు చేస్తూ భారీ వసూళ్ళను సాధించడం అంటే మామూలు విషయం కాదు. అందుకే ఇప్పటికి కూడా తెలుగు అభిమానులు అనుష్కని విపరీతంగా ఆరాధిస్తూ ఉంటారు ఇక ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాలో ఆమె అభినయానికి ప్రతి ఒక్కరు మంత్రముగ్ధులయ్యారనే చెప్పాలి. అలాంటి అనుష్క సినిమాలు మళ్ళీ ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూడటమే కాకుండా ఆమె అభిమానులు తీవ్రమైన అసంతృప్తికి లోనవుతున్నారు…