Takkari Donga Heroine: ప్రయోగాత్మక చిత్రాలు తీయడంతో అలనాడు సూపర్ స్టార్ కృష్ణ తప్ప ఇంకెవ్వరూ లేరని ఇప్పటికీ ఇండస్ట్రీలో చెప్పుకుంటారు. ఆయన కుమారుడు మహేష్ బాబు కొన్ని సాహస చిత్రాలు తీసి ప్రేక్షకులను అలరించారు. అయతే ఆయన తీసిన ఇలాంటి చిత్రాల్లో కొన్ని మాత్రమే సక్సెస్ అయ్యాయి. మరికొన్ని ఆకట్టుకోలేదు. అలా ఎంతో ఎక్స్ పెక్ట్ చేసిన తరువాత థియేటర్లోకి వచ్చి ఫెయిల్ అయిన మూవీ ‘టక్కరి దొంగ’. ఈ సినిమా సంగతి ఎలా ఉన్నా.. మహేష్ బాబు కౌ బాయ్ గెటప్ అదిరిపోద్ది.. ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడిగా ఇద్దరు భామలు నటించారు. వారిలో ఒకరు బిపాసా బసు కాగా.. మరొకరు లిసారే.
బిపాసా బసు ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. చేసింది తక్కువ సినిమాలే అయినా పాన్ ఇండియా లెవల్లో ఆకట్టుకుంది. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె సినిమా ఇండస్ట్రీ నుంచి అనూహ్యంగా తప్పుకుంది. ఆ తరువాత పెళ్లి చేసుకొని సినిమాలకు దూరంగా ఉంది. ఇక ఇందులో నటించిన మరో భామ లిసారే. అమాయంగా పాల వలె తెల్లగా ఉన్న ఈ భామ ఫస్ట్ మూవీతోనే ఆకట్టుకుంది. బాలీవుడ్ నుంచి దిగుమతి చేసుకోవడంలో మహేష్ మాత్రమే ముందుంటారని అంటున్న తరుణంలో లిసారే తో నటించడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది.
ఈ సినిమా తరువాత లిసారె తెలుగులో మళ్లీ నటించలేదు. కానీ బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించింది. అమెరికాలో పుట్టి పెరిగిన ఈమె 1990లో ఇండియాలో మోడలింగ్ లో ప్రవేశించింది. 2001 లో మొదటి సారి ‘కసూర్’ అనే హిందీ సినిమాలో నటించింది. ఆ తరువాత ఓ ఆల్బమ్ లో నటించింది. ప్రియా అనే తమిళ సినిమాలోనూ అలరించిన ఈ భామ దాదాపు 20 చిత్రాల్లో నటించింది. ఆ తరువాత టెలివిజన షోల్లో అలరిస్తోంది.
లిసారే అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. మల్టీపుల్ మైలోమా అనే వ్యాధితో ఆమె ఈ వ్యాధి గురించి 2009లో బయటపెట్టింది. ఇక 2012లో జాసన్ డెహ్నితో నిశ్చితార్థం చేసుకున్నారు.ఇదే సంవత్సరంలో కాలిఫోర్నియాలో వివాహం చేసుకున్నారు. సెప్టెంబర్ 2018లో అద్దె గర్భం ద్వారా కవలలు తల్లయ్యారు. ప్రస్తుతం లిసారే గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.