Rajamouli: రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ తో హీరోలందరూ ఒక్కసారైనా సినిమా చేయాలని ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే ఆయన తన స్టోరీస్ కి ఎవరైతే సెట్ అవుతారో వాళ్ళతోనే సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తుంటాడు. ఇక ఇదే క్రమంలో తెలుగులో ఉన్న దాదాపు స్టార్ హీరోలు అందరూ ఆయన దర్శకత్వం నటించారు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లను మినహా ఇస్తే మిగిలిన వాళ్లంతా రాజమౌళి దర్శకత్వం లో నటించారు…
ఇక ఇలాంటి క్రమంలోనే అల్లు అర్జున్ రాజమౌళి దర్శకత్వంలో నటించకుండానే పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు. ఇక తెలుగు లో ఉన్న స్టర్ణెరోలు అందరూ కూడా రాజమౌళి దర్శకత్వం నటించిన తర్వాతనే పాన్ ఇండియా స్టార్లు అయ్యారు. బాహుబలి తో ప్రభాస్, ట్రిపుల్ ఆర్ తో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి వారు పాన్ ఇండియా స్టార్లు గా ఎదిగారు కానీ రాజమౌళి తో సంబంధం లేకుండా అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా ఎదగడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయమనే చెప్పాలి. ఇక దాంతో అల్లు అర్జున్ అభిమానులు రాజమౌళి తో సంబంధం లేకుండానే మా హీరో స్టార్ హీరోగా దిగాడు అంటూ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నారు.
నిజానికి అల్లు అర్జున్ సుకుమార్ తో చేసిన పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో తన సత్తాను చాటుకుని బ్లాక్ బస్టర్ హిట్టు సాధించడమే కాకుండా పాన్ ఇండియా లో సక్సెస్ ని అందుకొని నేషనల్ అవార్డ్ ను కూడా అందుకున్నాడు.ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమాతో మరొకసారి ప్రేక్షకులను అలరించడానికి మన ముందుకు రాబోతున్నాడు.
ఇక ఇది ఇలా ఉంటే రాజమౌళి కూడా అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయాల్సింది కానీ అది అనుకోని కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో పాన్ వరల్డ్ లో ఒక సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో ఒక సినిమా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి…అయితే వీళ్ళ కాంబో ఎప్పుడు వర్క్ ఔట్ అవుతుందో చూడాలి…