Hero Movie: టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. గల్లా అశోక్ కు ఇండస్ట్రీ నుంచి సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు ఆశీస్సులు ఉన్నాయి. ‘హీరో’ మూవీతోనే గల్లా అశోక్ హీరోగా పరిచయం అవుతుంటం విశేషం. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా చేసుకున్న ‘హీరో’ మూవీ జనవరి 15న థియేటర్లలో వచ్చేందుకు ముస్తాబైంది.

‘హీరో’ మూవీలో గల్లా అశోక్ కు జోడీగా బ్యూటీఫుల్ హీరోయిన్ నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ మూవీకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించాడు. తొలి సినిమాలోనే గల్లా అశోక్ ను కౌబాయ్ గా కన్పించనుండటం విశేషం. ఈ మూవీలో సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు ఓ స్పెషల్ ట్రాక్ లో కన్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇది సినిమాకు అడ్వాంటేజ్ కావడం ఖాయంగా కన్పిస్తోంది.
Also Read: షాకింగ్ : ప్రముఖ స్టార్ హీరో మృతి !
తాజాగా ‘హీరో’ మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికొచ్చింది. ఈ మూవీని దర్శకుడు శ్రీరామ్ ముందుగా హీరో నితిన్ తో తీయాలని అనుకున్నాడట. ఈమేరకు వీరిద్దరి మధ్య డిస్కషన్స్ కూడా పలుసార్లు జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీ అటు ఇటు తిరిగి చివరి గల్లా అశోక్ దగ్గరికి చేరింది. ఇక మూవీ కోసం మూవీ మేకర్స్ భారీగానే ఖర్చు చేశారని సమాచారం.
‘సినిమా హీరో కావాలని కలలు కనే యువకుడు చివరికీ హీరో కాకపోగా ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. దీని నుంచి ఆ యువకుడి ఎలా బయట పడుతాడు?’ అనే కాన్సెప్ట్ ను దర్శకుడు శ్రీరామ్ సస్పెన్స్ తరహాలో చూపించినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో సినిమాలకు సంబంధించిన ఓ స్పెషల్ ట్రాక్ ఉంటుందట. ఆ సీన్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందనే వార్తలు విన్పిస్తున్నాయి.
Also Read: నితిన్ చేజారిన ‘హీరో’..చివరికీ అలా?