https://oktelugu.com/

The Girlfriend Teaser: గర్ల్ ఫ్రెండ్ టీజర్ రివ్యూ: రష్మిక నుండి మరో గీత గోవిందం, మనసులు దోచేసిన ప్రోమో

వరుస విజయాలతో జోరుమీదుంది రష్మిక మందాన. ఆమె లేటెస్ట్ మూవీ గర్ల్ ఫ్రెండ్. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. చిలసౌ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ గర్ల్ ఫ్రెండ్ చిత్రానికి దర్శకుడు. కాగా ఈ మూవీ టీజర్ నేడు విడుదల చేశారు. బ్లాక్ బస్టర్ గీత గోవిందం చిత్రాన్ని గర్ల్ ఫ్రెండ్ టీజర్ గుర్తు చేసింది..

Written By:
  • S Reddy
  • , Updated On : December 9, 2024 / 01:30 PM IST

    The Girlfriend Teaser(1)

    Follow us on

    The Girlfriend Teaser: బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తో రష్మిక మందాన సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటుతుంది. గత ఏడాది ఆమె హీరోయిన్ గా నటించిన యానిమల్ రూ. 900 కోట్ల వసూళ్లు రాబట్టింది. రన్బీర్ కపూర్ హీరోగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించారు. ఈ మూవీలో రష్మిక ఒకింత బోల్డ్ రోల్ చేసింది. ముద్దు సన్నివేశాల్లో నటించింది. ఇక లేటెస్ట్ మూవీ పుష్ప 2 ఒక ప్రభంజనం. ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది. అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ క్రేజీ సీక్వెల్.. నాలుగు రోజుల్లో రూ. 800 కోట్లకు లకు పైగా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రాబట్టింది.

    పుష్ప 2 రూ. 1000 కోట్ల వసూళ్లు అలవోకగా అధిగమించనుంది. రష్మిక ఇమేజ్ మరో రేంజ్ కి పుష్ప 2 తీసుకెళ్లింది. ఒక ప్రక్క స్టార్ హీరోల సరసన మాస్ రోల్స్ చేస్తూనే.. పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది. రష్మిక నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ గర్ల్ ఫ్రెండ్. చిలసౌ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ ఈ చిత్ర దర్శకుడు. దీక్షిత్ శెట్టి కీలక రోల్ చేస్తున్నాడు. గర్ల్ ఫ్రెండ్ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినేని నిర్మాతలుగా ఉన్నారు.

    ఒకటిన్నర నిమిషాలకు పైగా ఉన్న టీజర్ ఆకట్టుకుంది. మనసులు దోచేసింది. రష్మిక మందాన కాలేజ్ స్టూడెంట్ రోల్ చేయడం విశేషం. టీజర్ హీరో విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్ తో మొదలైంది. రష్మిక మందాన రోల్ విలక్షణంగా ఉంది. రొమాంటిక్ అంశాలతో పాటు గుండెలు బరువెక్కించే ఎమోషనల్ డ్రామా ప్రధానంగా గర్ల్ ఫ్రెండ్ ఉండనుంది. ఒక కోణంలో రష్మిక మందాన గీత గోవిందం చిత్రాన్ని గుర్తు చేసింది. హేషమ్ అబ్దుల్ వాహబ్ అందించిన బీజీఎమ్ ఆకట్టుకుంది. మొత్తంగా గర్ల్ ఫ్రెండ్ టీజర్ అంచనాలు పెంచేసింది.

    బ్యాక్ టు బ్యాక్ మాస్ కమర్షియల్ సినిమాల అనంతరం రష్మిక మందాన నుండి వస్తున్న ఈ రొమాంటిక్ ఎమోషనల్ లవ్ డ్రామా ఫ్యాన్స్ కి ట్రీట్ అని చెప్పాలి. గర్ల్ ఫ్రెండ్ తో పాటు రైన్ బో టైటిల్ తో రష్మిక మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తుంది. కుబేర మూవీలో ఛాలెంజింగ్ రోల్ లో మెప్పించనుంది.