The Girlfriend Movie OTT: రీసెంట్ గానే ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘ది గర్ల్ ఫ్రెండ్'(The Girlfriend Movie) చిత్రం కమర్షియల్ గా ఈ ఏడాది భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒకటిగా నిల్చింది. రష్మిక మందాన(Rashmika Mandanna) తొలి లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇంత పెద్ద హిట్ అవుతుందని బహుశా రష్మిక అభిమానులు కూడా ఊహించి ఉండరు. ఎందుకంటే ప్రమోషనల్ కంటెంట్ ఒక్కటి కూడా విడుదలకు ముందు క్లిక్ అవ్వలేదు కాబట్టి. నిన్నగాక మొన్న విడుదలైనట్టు అనిపిస్తున్న ఈ చిత్రం అప్పుడే 7 వ రోజులోకి అడుగుపెట్టింది. మొదటి ఆరు రోజులకు కలిపి ఈ సినిమా 18 కోట్ల 25 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 9 కోట్ల 21 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. విడుదలకు ముందు 7 కోట్ల రూపాయిల రేంజ్ లో ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ సినిమాకు అప్పుడే రెండు కోట్ల 21 లక్షల రూపాయిల లాభాలు వచ్చాయి.
ఫుల్ రన్ లో ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ అప్డేట్ వచ్చేసింది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే, ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని అన్ని భాషలకు కలిపి నెట్ ఫ్లిక్స్ సంస్థ 14 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. నాలుగు వారాల ఓటీటీ డీల్ ఉండడం తో ఈ సినిమా నెలాఖరున నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. థియేటర్స్ లో ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం, కచ్చితంగా ఓటీటీ లో థియేటర్స్ కంటే ఎక్కువ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు ఆడియన్స్ మాత్రమే కాకుండా, ఇతర భాషలకు సంబంధించిన ఆడియన్స్ కూడా ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ ద్వారా బాగా చూసే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది.
ఇది ఇలా ఉండగా ప్రపంచవ్యాప్తంగా ప్రాంతాలవారీగా ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతం నుండి రెండు కోట్ల 53 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, సీడెడ్ ప్రాంతం నుండి 56 లక్షలు, ఆంధ్ర ప్రాంతం నుండి 2 కోట్ల 6 లక్షలు రాబట్టింది. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 6 రోజులకు 5 కోట్ల 15 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి కోటి 12 లక్షలు, ఓవర్సీస్ నుండి మూడు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా 9 కోట్ల 21 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి.