Photo Story: సినీ ఇండస్ట్రీలో చాలామంది ఒకటి, రెండు సినిమాలతో నే పాపులర్ అయిన వారు ఉన్నారు. ముఖ్యంగా అందచందాలతో అలరించే హీరోయిన్లు ఇతర ఇండస్ట్రీల్లో కంటే టాలీవుడ్ లోనే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల రిలీజై సక్సెస్ సాధించిన ఓ సినిమాలో నటించిన భామ అంతకుముందు మరాఠి, హిందీ సినిమాల్లో నటించింది. కానీ తెలుగులో నటించిన ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా లెవల్లో పాపులారిటీ తెచ్చుకుంది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. అయితే ఆ హీరోయిన్ నటించిన ఓ సినిమాలోని పిక్ ఆకట్టుకుంటోంది. ఇందులో ఆమె గుర్తుపట్టలేని విధంగా ఉంది. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో చెప్పుకోండి..
ఎంతో అమాయకంగా డీ గ్లామర్ గా కనిపిస్తున్న ఈమెకు తెలుగు సినిమా అదృష్టం తెచ్చిపెట్టంది. ఇప్పటికైనా ఆమె ఎవరో గుర్తుపట్టారా? అయితే మేమే చెబుతాం.. అమె ఎవరో కాదు పాన్ ఇండియా హీరోయిన్ మృణాల్ ఠాకూర్. మృణాల్ ఠాకూర్ నటించిన ‘సీతారామం’ ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలిసింది. ఈ సినిమా సక్సస్ తరువాత ఆమెకు తెలుగులో వరుస ఆఫర్లు వస్తున్నాయి. తాజగా ఆమె నాని తో కలిసి ‘హాయ్ నాన్న’ సినిమాలో కనిపించనుంది. అలాగే విజయ్ దేవరకొండతో కలిసి ఓ సినిమా చేస్తోంది.
‘ఏ ఖామోషియాన్’ అనే హిందీ సీరియల్ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మృణాళ్ ఠాకూర్ 1992 ఆగస్టు 1న మహారాష్ట్రలో జన్మించింది. సీరియల్ లో గుర్తింపు తెచ్చుకున్న తరువాత ‘విట్టి దండు’ అనే మరాఠి సినిమా ద్వారా వెండితెరపై మొదటిసారి కనిపించింది. ఆ తరువాత హిందీ సినిమాల్లో అవకాశాలు తెచ్చుకుంది. అయితే హిందీలో ఎన్ని సినిమాల్లో నటించినా తెలుగులో ‘సీతారామం’ సినిమాతో ఆమె పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకుంది.
‘సీతారామం’ సినిమాలో మృణాల్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అందుకే ఆమె పలు ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్ మలుపు తిప్పిన సినిమా ఇది అని చెబుతుంది. అయితే సీతారామం తరువాత ఇతర ఇండస్ట్రీలో కంటే తెలుగులోనే అవకాశాలు రావడం విశేషం. ఇప్పటికే నానితో నటించిన ‘హాయ్ నాన్న’ సినిమాకు సంబంధించిన పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమా ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ తరువాత విజయ్ దేవరకొండతో కలిసి పరుశురామ్ డైరెక్షన్లో ఓ సినిమాలో నటిస్తోంది. ఇలా సక్సస్ ఫుల్ సినిమాల్లో నటిస్తున్న మృణాళ్ కు మంచి సినిమాలు రావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.