Kubera First Review : అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), ధనుష్(Dhanush) కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల(Shekar Kammula) దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం ‘కుబేర'(Kubera Movie). షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన పాటలకు, టీజర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. సున్నితమైన అంశాల మీద శేఖర్ కమ్ములకు సినిమాలు తియ్యడం అలవాటు. ఈ చిత్రాన్ని కూడా అలాంటి అంశాలతోనే తెరకెక్కించినట్టుగా టీజర్ ని చూస్తే అర్థం అవుతుంది. ‘లవ్ స్టోరీ’ అనే చిత్రం తర్వాత బాగా గ్యాప్ తీసుకొని శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. స్క్రిప్ట్ వర్క్ ని తన మనసుకి నచ్చినట్టు తీర్చి దిద్దడానికే ఆయనకు ఏడాదికి పైగా సమయం పట్టిందట.
ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన మొదటి కాపీని సెన్సార్ కి కూడా పంపేసారట. రేపు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే సెన్సార్ కి పంపే ముందు మొదటి కాపీ కి సంబంధించిన స్పెషల్ ప్రివ్యూ షోని ప్రసాద్ ల్యాబ్స్ లో నిన్న మూవీ టీం కొంతమంది ప్రముఖులతో కలిసి చూశారట. ఈ ప్రివ్యూ షో నుండి వచ్చిన టాక్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. శేఖర్ కమ్ముల ఈ చిత్రం లో తన దర్శకత్వ విశ్వరూపం చూపించాడట. మొదటి నుండి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో అద్భుతమైన టేకింగ్ తో హృదయాలను పిండేసే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఇక అక్కినేని నాగార్జున కి చాలా కాలం తర్వాత నటనకు అద్భుతమైన స్కోప్ ఉన్న పాత్ర దొరికిందని అంటున్నారు. ఇక ధనుష్ గురించి ప్రత్యేకించి చెప్పాలా..?, సాధారణమైన సన్నివేశాన్ని తన తనతో వేరే లెవెల్ కి తీసుకొని వెళ్లగల ప్రతిభ ఉన్న నటుడు ఆయన.
అలాంటి నటుడికి నటనకు ఫుల్ స్కోప్ ఉన్న పాత్ర దొరికితే ఇక ఆగుతాడా?, ఈ సినిమాలో కూడా అదే జరిగిందని తెలుస్తుంది. ముఖ్యంగా చివరి 15 నిమిషాలు నాగార్జున, ధనుష్ మధ్య వచ్చే సన్నివేశాలు, సంభాషణలు సినిమా రేంజ్ ని ఎక్కడికో తీసుకొని వెళ్తుందని అంటున్నారు. ఓవరాల్ గా ఈ చిత్రం ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా ఉండబోతుందట. శేఖర్ కమ్ముల కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలిచే అవకాశాలు కూడా పుష్కలంగా ఈ చిత్రానికి ఉన్నాయి. ఈ ఏడాది అక్కినేని ఫ్యామిలీ కి బాగా కలిసొచ్చింది. ఫిబ్రవరి నెలలో నాగార్జున తనయుడు అక్కినేని నాగ చైతన్య ‘తండేల్’ చిత్రం తో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు ఆ సక్సెస్ స్ట్రీక్ ని తండ్రి అక్కినేని నాగార్జున కొనసాగిస్తాడో లేదో తెలియాలంటే మరో 20 రోజులు ఆగాల్సిందే.