Thandel : మత్స్యకారుల( fishermans ) జీవన విధానాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన సినిమా ‘తండేల్’. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు చందు మొండేటి. శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకార గ్రామంలో జరిగిన యదార్థ ఘటనను ఇతివృత్తంగా తీసుకొని ఈ సినిమాను చిత్రీకరించారు. వాస్తవ ఘటనల ఆధారంగా అల్లిన ఫిక్షనల్ లవ్ స్టోరీ ఇది. హీరోయిన్ శ్రీకాకుళంలో ఉంటే.. హీరో పాకిస్తాన్ లో ఉంటాడు. తండేల్ అంటే గుజరాతీ పదం. గుజరాత్ లోని మత్స్యకారులు ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. తండేల్ అంటే లీడర్. కెప్టెన్ ఆఫ్ ద బోట్ అని అర్థం. వేటకు వెళ్లే సమయంలో ప్రతి బోటులోను పదిమందికి పైగా జాలర్లు ఉంటారు. ఒకేసారి బోట్లలో వేటకు బయలుదేరుతారు. జాలర్ల సమూహానికి లీడర్ గా ఉండే వ్యక్తిని తండ్రి అని పిలుస్తుంటారు. శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకారులు జీవనాధారం కోసం ఏడాదిలో తొమ్మిది నెలల పాటు వేటకు వెళ్తారు. స్థానికంగా వేట గిట్టుబాటు కాక ఎక్కువమంది గుజరాత్ వెళ్తుంటారు. అక్కడ ప్రాచుర్యంలో ఉన్న తండేల్ పదం.. శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులకు కూడా వాడుకగా మారింది.
* ఇదో వాస్తవిక కథ
తాజాగా విడుదలైన తండేల్ చిత్రం శ్రీకాకుళం జిల్లాలో( Srikakulam district) వెలుగు చూసిన ఒక వాస్తవిక కథ. 2018 నవంబర్ 31న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 22 మంది మత్స్యకారులు అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. వీరంతా గుజరాత్ లోని వీరావల్ ప్రాంతంలో చేపల వేటకు సంబంధించి పనికి కుదిరారు. యాట జూలై, ఆగస్టు సమయాల్లో గుజరాత్ వెళుతుంటారు. తిరిగి ఫిబ్రవరి, మార్చి నెలలో స్వస్థలాలకు చేరుకుంటారు. జిల్లా వ్యాప్తంగా మత్స్యకారులు దీనినే అనుసరిస్తుంటారు.
* సరిహద్దు జలాల్లోకి ప్రవేశించి
అయితే ఇలా వెళ్లిన శ్రీకాకుళం జిల్లా డి.మత్సలేశం( d. Matsyalesam) గ్రామానికి చెందిన మత్స్యకారులు 2018 నవంబర్ 31న చేపల వేటకు వెళ్లారు. అరేబియా మహాసముద్రంలో పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించారు. పాకిస్తాన్ పోస్ట్ గార్డులకు పట్టుబడ్డారు. మొత్తం నాలుగు బోట్లలో 22 మంది మత్స్యకారులు వేటకు వెళ్ళగా.. అందులో మూడు బోట్లు పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లిపోయాయి. ఆ బోట్ల లో ఉన్న మత్స్యకారులు పాకిస్తాన్ బందీలుగా మారిపోయారు. ఈ విషయాన్ని మిగతా ఒక బోటులో ఉన్న మత్స్యకారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అప్పట్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించింది. అప్పటి కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ పాకిస్తాన్ ప్రభుత్వంతో పలుమార్లు సంప్రదింపులు జరిపారు. అనేక చర్చలు జరిపిన తర్వాత చివరకు 2020 జనవరి 6న పాకిస్తాన్ చెర నుంచి మత్స్యకారులు విముక్తి అయ్యారు.
* మత్స్యలేశంతో ప్రారంభం
అయితే ఈ చిత్రం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల(etcherla)మండలం డి. మత్స్యలేసం గ్రామంతో ప్రారంభం అవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ గ్రామానికి చెందిన మత్స్యకారుల జీవనాన్ని, విదేశీ జలాల్లో చిక్కుకోవడాన్ని ఇతివృత్తంగా తీసుకొని దర్శకుడు చందు మండేటి ఒక పర్ఫెక్ట్ లవ్ స్టోరీని క్రియేట్ చేయగలిగారు. ఎందుకుగాను చాలాసార్లు ఆ చిత్ర యూనిట్ శ్రీకాకుళం జిల్లా మత్స్యలేశంలో పర్యటించింది. జిల్లాలోని మత్స్యకార ప్రాంతాల్లో స్థితిగతులను కూడా తెలుసుకుంది. పూర్తిస్థాయిలో శ్రీకాకుళం జిల్లా యాసను గ్రహించింది. అయితే ఈ చిత్రానికి మొత్తం మూల కథ శ్రీకాకుళం జిల్లా కావడం విశేషం. ఈ సినిమా టిక్ టాక్ సొంతం చేసుకోవడంతో జిల్లా మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ జీవితాల్లో వ్యధను కళ్ళకు కట్టినట్టు చూపించారని చిత్ర యూనిట్కు అభినందనలు తెలుపుతున్నారు.