Sankrantiki Vasthunnam : విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన మూడవ చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. విడుదలకు ముందు బ్లాక్ బస్టర్ సాంగ్స్ తో అంచనాలను అమాంతం పెంచేసిన ఈ సినిమా, విడుదల తర్వాత అంతకు మించిన రెస్పాన్స్ ని సొంతం చేసుకొని ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి క్యూలు కట్టేలా చేసింది. ఇప్పుడు ఈ సినిమా టికెట్స్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు పెద్ద యుద్దాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడికి వెళ్లిన, ఏ థియేటర్ లో చూసినా హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. వెంకటేష్ కి టాక్ వస్తే థియేటర్స్ లో ఫ్యామిలీ ఆడియన్స్ తో నిండిపోతుంది, నెలలు తరబడి ఆడుతాయి అని ఒకప్పుడు ట్రేడ్ విశ్లేషకులు అనేవారు. అది నేటి తరం ఆడియన్స్ కి కూడా తన స్టామినా తో అర్థం అయ్యేలా చూపిస్తున్నాడు వెంకటేష్. మొదటిరోజు ఏకంగా 45 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని రాబట్టిన ఈ సినిమాకి రెండవ రోజు 30 కోట్లు గ్రాస్ వస్తుందని ట్రేడ్ అంచనా వేస్తుంది.
ఇదంతా పక్కన పెడితే ‘గేమ్ చేంజర్’ చిత్రంతో నష్టాలను చూసిన దిల్ రాజు, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో భారీ హిట్ ని అందుకొని నష్టాలను పూడ్చుకున్నాడు అని ట్రేడ్ అనుకునేలోపు ఈ సినిమాకి సంబంధించిన పైరసీ ఇప్పుడు ఆయన్ని కలవరపెడుతుంది. ఈమధ్య కాలం లో ప్రతీ సినిమాకి పైరసీ జరుగుతుంది. అది సర్వసాధారణమే కదా, సినిమా వసూళ్లపై ఈమధ్య పెద్దగా ప్రభావం చూపించలేదని నిర్మాతలు పెద్దగా పట్టించోలేదు. ఎందుకంటే అవి థియేటర్స్ ప్రింట్స్ లాగా ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం HD ప్రింట్ ని దింపేస్తున్నారు. ఇతర భాషల్లో దబ్ చేయడం వల్ల, అటు వైపు నుండే ఈ రేంజ్ క్వాలిటీ వస్తుందని అనుకుంటున్నారు. రీసెంట్ గానే నిర్మాత దిల్ రాజు ‘గేమ్ చేంజర్’ చిత్రాన్ని సోషలో మీడియా లో పైరసీ చేసిన వారిపై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని జీ5 సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసింది. సుమారుగా పాతిక కోట్ల రూపాయిలు ఇచ్చి ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని కొను గోలు చేశారట. అయితే ఒప్పందం ప్రకారం ఈ చిత్రాన్ని నాలుగు వారాల తర్వాత విడుదల చేయాలని అనుకున్నారు. కానీ సినిమాకి థియేట్రికల్ రన్ అద్భుతంగా వచ్చేలా అనిపిస్తుంది. కనీసం నాలుగు వారాలు కళ్ళు చెదిరే లాభాలు వచ్చే సూచనలు ఉండడంతో నాలుగు వారాల్లో విడుదల చేయడం కుదరదని ఓటీటీ వారికి చెప్పారట. దీనికి ఆ సంస్థ ఒప్పుకోవడం లేదు. ఒకవేళ ఆలస్యంగా విడుదల చేయాల్సి వస్తే, ముందు అనుకున్న రేట్ కంటే తక్కువ ఇస్తామని అన్నారట. ఈ విషయంపై దిల్ రాజు, జీ 5 యాజమాన్యం మధ్య చర్చలు నడుస్తున్నాయి. ఈ చర్చల్లో ఎవరు నెగ్గుతారో చూడాలి.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: The film sankranthiki vasthunnam is coming to ott on the 2nd day of its release
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com