Look back entertainment 2024 : మరికొద్ది రోజుల్లో 2025 ప్రవేశించనుంది. 2024 సంవత్సరంలో సినీ పరిశ్రమ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. ప్రేమ వ్యవహారాలు, ఆస్తి తగాదాలు, వివాహేతర సంబంధాలు సినీ పరిశ్రమను వార్తల్లో నానేలాగా చేశాయి. ఈ వివాదాల్లో ప్రముఖంగా వినిపించిన పేరు రాజ్ తరుణ్. యువ నటుడిగా రాజ్ తరుణ్ తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నారు. కుమారి 21ఎఫ్, ఉయ్యాల జంపాల, అంధగాడు, సినిమా చూపిస్త మావ వంటి సినిమాల ద్వారా ప్రేక్షకులకు రాజ్ తరుణ్ దగ్గరయ్యాడు. రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని లావణ్య అనే మహిళ నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. రాజు తరుణ్ వల్ల తను గర్భం దాల్చానని.. అతడు అనేకమంది అమ్మాయిలతో సంబంధాలు కలిగి ఉన్నాడని.. నన్ను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని ఆరోపించింది. వీరి కేసుకు సంబంధించిన వార్తలు మీడియాలో ప్రముఖంగా వినిపించాయి. కొద్దిరోజులుగా వీరి వ్యవహారం చల్లబడింది.
జానీ మాస్టర్ కేసు
తెలుగు చిత్ర పరిశ్రమలో అద్భుతమైన డ్యాన్స్ కంపోజర్ అయిన జానీ మాస్టర్ వివాదంలో చుట్టుకున్నాడు. ఎన్నో అద్భుతమైన పాటలకు కొరియోగ్రఫీ చేసిన జానీ మాస్టర్.. తన దగ్గర సహాయకురాలిగా ఉన్న ఓ అమ్మాయి ని లైంగికంగా వేధించాడని.. ఆమెను ఇబ్బంది పెట్టాడని ఆరోపణలు వినిపించాయి. పైగా ఆమె ఎదురపై కేసు కూడా పెట్టింది. దీంతో జానీ మాస్టర్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇటీవల అతడు బయటికి వచ్చాడు.. బయటికి వచ్చిన తర్వాత అతడు తన ప్రొఫెషన్ కొనసాగిస్తున్నాడు. ఇటీవల ఓ మహిళా డాన్సర్ తో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. దానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో విపరీతంగా సందడి చేసింది.
దర్శన్ వివాహేతర సంబంధం
కన్నడ నటుడు ఓ హత్యా నేరంలో చిక్కుకున్నాడు. రేణుక స్వామి అని అభిమానిని దర్శన్ అంతమొదించాడని పోలీసులు అభియోగాలు మోపారు. దర్శన్ పవిత్ర గౌడ అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు ఆమధ్య వార్తలు వచ్చాయి. వాటిని దర్శన్ అభిమాని రేణుక స్వామి నమ్మాడు. ఇందులో భాగంగా తన పేరు మీద నకిలీ ఇన్ స్టా గ్రామ్ ఖాతా ఓపెన్ చేశాడు. దానిద్వారా పవిత్ర గౌడ కు అసభ్యకరమైన సందేశాలు పంపించాడు. ఈ విషయాన్ని పవిత్ర దర్శన్ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో రేణుక స్వామి పై దర్శన్ కోపం పెంచుకున్నాడు. కొంతమంది దుండగుల సహాయంతో రేణుక స్వామిని అంతమొందించాడు. తన పేరు బయటికి రాకుండా చూడాలనుకున్నప్పటికీ.. దర్శన్ పేరు రాకుండా ఆగలేదు. రేణుక స్వామి చనిపోయినటికి అతని భార్య గర్భవతి. ప్రస్తుతం దర్శన్, పవిత్ర జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
మోహన్ బాబు కుటుంబంలో అలజడి
ప్రముఖ సీనియర్ నటుడు మోహన్ బాబు కుటుంబ సభ్యుల మధ్య ఆస్తుల విషయంలో వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. మోహన్ బాబు విగ్రహం కోల్పోయి ఓ టీవీ రిపోర్టర్ పై దాడి చేశాడు. ఈ ఘటనలో ఆ టీవీ రిపోర్టర్ తల పగిలింది. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితి కూడా బాగోలేదని తెలుస్తోంది. ఆయన కూడా ఓ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
ఇవి మాత్రమే కాకుండా మాదకద్రవ్యాల ఆరోపణలు కూడా సినీ పరిశ్రమను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ క్రమంలో చాలామంది సినీ నటులు పోలీసుల ప్రశ్నలు ఎదుర్కొన్నారు.. మొత్తంగా ఈ ఏడాది సినీ పరిశ్రమకు చాలా షాక్ లు ఇచ్చిందని చెప్పుకోవాలి.