Acharya TRP Rating: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ఆచార్య సినిమా ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచిన సంగతి మన అందరికి తెలిసిందే..కొరటాల శివ లాంటి టాప్ డైరెక్టర్ చిరంజీవి మరియు రామ్ చరణ్ ని ఒకే సినిమాలో చూపిస్తున్నాడు కాబట్టి కచ్చితంగా అభిమానులకు కనులపండుగ లాగ ఈ సినిమా ఉంటుంది అని అనుకున్నారు..కానీ అభిమానుల అంచనాలను కనీస స్థాయిలో కూడా అందుకోలేకపోయింది ఈ చిత్రం.

చిరంజీవి 150 సినిమాలు చేసాడు కానీ, ఆయనతో ఇలాంటి చెత్త సినిమా ఏ డైరెక్టర్ కూడా చెయ్యలేదు అంటూ అభిమానులు పెదవి విరిచారు..OTT లో స్ట్రీమింగ్ చేసినప్పుడు కూడా మిశ్రమ స్పందనే వచ్చింది..కొరటాల శివ ఈ సినిమా బిజినెస్ లో వేలు పెట్టడం తో ఆర్థికంగా కూడా ఆయన ఘోరంగా నష్టపోయాడు..ఇవన్నీ పక్కన పెడితే ఇటీవలే ఈ సినిమాని జెమినీ టీవీ లో టెలికాస్ట్ చెయ్యగా ఎవ్వరు ఊహించని రెస్పాన్స్ ని ఈ సినిమా సొంతం చేసుకుంది.
సాధారణంగా ఘోరమైన డిజాస్టర్ సినిమాలకు టీఆర్ఫీ రేటింగ్స్ బాగా తక్కువగా వస్తుంటాయి..కానీ ఆచార్య సినిమాకి మాత్రం మంచి టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి..దసరా కానుకగా ప్రసారమైన ఈ సినిమాకి 7 టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చినట్టు సమాచారం..ఇది చిరంజీవి రేంజ్ టీఆర్ఫీ రేటింగ్స్ అయితే అసలు కాదు..కానీ ఒక డిజాస్టర్ సినిమాకి ఈ రేటింగ్స్ అంతే బాగా వచ్చినట్టే అని చెప్పొచ్చు..ఇదే జెమినీ టీవీ లో మహర్షి వంటి సూపర్ హిట్ సినిమాకి కేవలం 9 టీఆర్ఫీ రేటింగ్స్ మాత్రమే వచ్చాయి.

ఇక ఇటీవల విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ మరియు మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ వంటి సినిమాలు స్టార్ మా టెలికాస్ట్ చెయ్యగా ఆ రెండు సినిమాలకు 9 స్థాయిలో రేటింగ్స్ వచ్చాయి..సూపర్ హిట్ సినిమాలకే 9 టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చినప్పుడు..డిజాస్టర్ సినిమాకి 7 టీఆర్ఫీ లు రావడం అంటే గొప్పనే కదా అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.