https://oktelugu.com/

Hero : రెండు కాళ్ళు విరిగాయి నువ్వు హీరోవి కాలేవు అని డాక్టర్లు చెప్పారు… కట్ చేస్తే స్టార్ హీరో అయ్యాడు…ఇంతకీ ఆయన ఎవరంటే..?

Hero : సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఎప్పటికప్పుడు వాళ్లను వాళ్లు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చిన కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అయిపోయే అవకాశాలు రావచ్చు. ముఖ్యంగా హీరోలైతే చాలా మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తేనే స్టార్ స్టేటస్ ను అందుకుంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : March 9, 2025 / 09:03 AM IST
    Hero

    Hero

    Follow us on

    Hero : సినిమా ఇండస్ట్రీలో రాణించాలి అంటే టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి. చాలామందికి మంచి టాలెంట్ ఉన్నప్పటికి ఇండస్ట్రీలో ఎక్కువగా అవకాశాలను అందుకోలేక వచ్చిన ఛాన్స్ లను సద్వినియోగం చేసుకోలేక ఇండస్ట్రీ నుంచి ఫెయిడ్ అవుట్ అయిపోతూ ఉంటారు. ఇలాంటి క్రమంలోనే ఒక స్టార్ హీరో ఇండస్ట్రీకి రావాలనుకున్న కొత్తలో యాక్సిడెంట్ కి గురై తన రెండు కాళ్ళను కోల్పోయి నాలుగు సంవత్సరాల పాటు వీల్ చైర్ కే పరిమితమైపోయాడు. డాక్టర్లందరూ నువ్వు లేచి నడవలేవు అని చెప్పినప్పటికి ఆయనకు సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్, యాక్టర్ అవ్వాలనే కోరిక బలంగా ఉండడంతో డాక్టర్ల మాటలను సైతం పక్కనపెట్టి తనకంటూ ఒక విల్ పవర్ ని ఏర్పాటు చేసుకొని నేను ఎందుకు నడవలేను అనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగే ప్రయత్నం చేశాడు. తద్వారా ఆయన ప్రయత్నం సఫలం అయింది. తను అనుకున్నట్టుగానే నడిచాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. ఇంతకీ ఆ నటుడు ఎవరు అంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న విక్రమ్(Vikram)…

    Also Read : చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి.. స్టార్ హీరోతో డేటింగ్ అంటూ పుకార్లు.. కానీ ఇప్పుడు ఈ అమ్మడి దశ తిరిగింది.. ఎవరంటే..

    కెరియర్ మొదట్లోనే పెద్ద యాక్సిడెంట్ కి గురైన విక్రమ్ ఇక సినిమా ఇండస్ట్రీ మీద ఆశలు వదిలేసుకోవాలి అని అందరూ చెప్పినప్పటికి ఆయనకు సినిమా మీద ఉన్న ప్రేమే అతన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది అంటూ అతని గురించి తెలిసిన ప్రతి ఒక్కరు చాలా గొప్పగా చెబుతూ ఉంటారు. ఒక మనిషి తలుచుకుంటే ఎంతటి పెద్ద ప్రాబ్లం ను అయినా సరే ఎదిరించొచ్చు అని చెప్పడానికి విక్రమ్ ను మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు.

    వైవిద్య భరితమైన పాత్రలను పోషించాలి అంటే ప్రతి ఒక్కరికి విక్రమ్ మాత్రమే గుర్తుకొస్తాడు. ఒకప్పుడు కమల్ హాసన్ ఎలాగైతే విభిన్నమైన తరహాలో నటించి మెప్పించాడో ఆయన తర్వాత విక్రమ్ మాత్రమే అలాంటి పాత్రలను పోషించగలడనే ఒక గొప్ప గుర్తింపును సైతం సంపాదించుకున్నాడు. ఇక రొటీన్ రెగ్యూలర్ సినిమాలు చేయడానికి ఆయన ఎప్పుడూ ఇంట్రెస్ట్ చూపించడు. ఏదో ఒక కొత్తదనం ఉంటే తప్ప ఆయన సినిమాకి కమిట్ అవ్వడనేది వాస్తవం.

    ఇక ఏది ఏమైనా తనలాంటి స్టార్ హీరో అటు తమిళ్, ఇటు తెలుగులో కూడా మంచి గుర్తింపును సంపాదించుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి… గత సంవత్సరం ‘తంగలన్’ (Thangalan) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విక్రమ్ ఇక మీదట మరి కొన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు…

    Also Read : ఆ స్టార్ హీరోయిన్ తో రెండు సినిమాలు చేసి తనతో డేట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో…ఈ విషయం తన భార్య కి తెలిసి ఏం చేసిందో తెలుసా..?