https://oktelugu.com/

Kajal Agarwal : సెట్స్ లో అందరి ముందు కాజల్ చెంప చెళ్లుమనిపించిన డైరెక్టర్..!

Kajal Agarwal : కాజల్ అగర్వాల్ ఫేమ్, స్టార్డమ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో ఎదిగిన ఈ బ్యూటీ సౌత్ ఇండియాను షేక్ చేశారు. స్టార్ అయ్యాక బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ పట్టి చిత్రాలు చేశారు. రెండు తరాల టాలీవుడ్ హీరోలను కవర్ చేసిన అరుదైన హీరోయిన్స్ లో కాజల్ ఒకరు. ఎన్టీఆర్, మహేష్, పవన్, అల్లు అర్జున్, బన్నీ, ప్రభాస్ లతో నటించారు. అలాగే చిరంజీవితో జతకట్టారు. తాజాగా బాలయ్య 108 మూవీకి […]

Written By:
  • NARESH
  • , Updated On : February 5, 2023 8:40 pm
    Follow us on

    Kajal Agarwal : కాజల్ అగర్వాల్ ఫేమ్, స్టార్డమ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో ఎదిగిన ఈ బ్యూటీ సౌత్ ఇండియాను షేక్ చేశారు. స్టార్ అయ్యాక బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ పట్టి చిత్రాలు చేశారు. రెండు తరాల టాలీవుడ్ హీరోలను కవర్ చేసిన అరుదైన హీరోయిన్స్ లో కాజల్ ఒకరు. ఎన్టీఆర్, మహేష్, పవన్, అల్లు అర్జున్, బన్నీ, ప్రభాస్ లతో నటించారు. అలాగే చిరంజీవితో జతకట్టారు. తాజాగా బాలయ్య 108 మూవీకి సైన్ చేశారు. 15 ఏళ్లుగా ఆమె ప్రస్థానం సాగుతుంది. పెళ్ళైనా, ఒక బిడ్డకు తల్లైనా ఆమె క్రేజ్ ఇంచు కూడా తగ్గలేదు.

    అలాంటి కాజల్ ఓ దర్శకుడి చేతిలో దెబ్బలు తిన్నారనే వాదన ఉంది. హీరోయిన్ గా కాజల్ మొదటి చిత్రం లక్ష్మీ కళ్యాణం. 2007లో విడుదలైన ఈ చిత్రానికి తేజ డైరెక్టర్ కాగా నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించారు. డైరెక్టర్ తేజకి కోపం ఎక్కువని పరిశ్రమలో టాక్. విసిగించిన నటులపై పలు సందర్భాల్లో చేయి చేసుకున్నారని వినికిడి. అందులోనూ తేజ కొత్త నటులతో చేస్తారు. స్టార్స్ అయితే ఆయన గట్టిగా చెప్పలేరు. కొత్తవాళ్లను తనకు నచ్చినట్లుగా నటింపజేయించుకోవచ్చని ఆయన ఆలోచన. ఈ విషయం ఒకటి రెండు సందర్భాల్లో తేజ చెప్పారు.

    కొత్తవాళ్లు మాట వింటారు. అయితే వాళ్లతో ఓ చిక్కు కూడా ఉంది. నటన మీద అంత అవగాహన ఉండదు. కెమెరాను ఎలా ఫేస్ చేయాలి. ఎలా నిల్చోవాలి. డైలాగ్ ఎలా చెప్పాలి… వంటి బేసిక్స్ కూడా తెలియకపోవచ్చు. ఈ క్రమంలో బాగా విసిగించిన హీరో, హీరోయిన్స్ ని తేజా కొట్టారనేది ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. అలా తేజా చేతిలో దెబ్బలు తిన్న హీరోయిన్స్ లో కాజల్ కూడా ఒకరట. లక్ష్మీ కళ్యాణం మూవీలో హీరోయిన్ ప్రేమను తండ్రి అంగీకరించడు. ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి చేయాలి అనుకుంటాడు.

    కాజల్ పాత్రకు ఏడ్చే సన్నివేశాలు చాలా ఉంటాయి. కాజల్ కి అసలు ఏడుపు రావడం లేదట. ఎంతకీ ఎమోషన్ పలకకపోవడంతో విసిగిపోయిన తేజా అందరి ముందే కాజల్ చెంప చెళ్లుమనిపించాడట. అప్పుడు సెట్ అయ్యిందట. అలా కాజల్ పై తేజ చేయిచేసుకున్నాడనే ఓ వాదన ఉంది. అయితే దీన్ని ఓ సందర్భంలో కాజల్ ఖండించారు. నాకు ఏడుపు రాని మాట వాస్తవమే, కానీ తేజ కొట్టలేదు. ఆయన సహనంగా చెప్పారు. లక్ష్మీ కళ్యాణం నాటికి అసలు నాకు నటనలో ఓనమాలు కూడా తెలియవు. చిన్నప్పటి నుండి బాధ అంటే ఏమిటో తెలియకుండా పెరిగాను. దాని వలన నాకు ఏడవడం కూడా రాదు. తేజా గారు అన్ని చెప్పి చేయించుకున్నారని వెల్లడించారు.