Pushpa 3 : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే… ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ (Allu Arjun) లాంటి స్టార్ హీరో సైతం ప్రస్తుతం ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాతో పెను ప్రభంజనాలను సృష్టిస్తున్నాడు. ఇక ‘పుష్ప 2’ సినిమా సూపర్ సక్సెస్ అయిన నేపధ్యం లో రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన మరొక 20 నిమిషాల పుటేజ్ ని ఆడ్ చేసి ఈ సినిమాను రీ లోడెడ్ వెర్షన్ (Re loaded version) గా మన ముందుకు తీసుకువచ్చారు. ఇక ఈ రీ లోడెడ్ వెర్షన్ మీద కూడా ప్రేక్షకులకు మంచి అంచనాలు ఉండటంతో ఈ సినిమాను చూడటానికి అందరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అదనంగా కలిపిన 20 నిమిషాల సీన్స్ ను కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఇందులో పుష్ప జర్మనీకి వెళ్లడానికి 40 రోజుల పాటు ఒక ట్రక్ లో ఎలా ఉన్నాడు అనేదానికి ఒక లాజిక్ అయితే తెలియజేశారు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా మీద ఇప్పుడు యావత్ ఇండియన్ సినిమా సెలబ్రిటీలు అందరు ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఇండస్ట్రీ హిట్టు కొట్టడానికి మరొక అడుగు దూరంలో మాత్రమే ఉంది. ఇక మొత్తానికైతే ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ సాధించి ఇండియాలోనే నెంబర్ వన్ సినిమాగా నిలవాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతుంది. ఇక ఏది ఏమైనా కూడా తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకున్న అల్లు అర్జున్ ఈ సినిమాకి సీక్వెల్ ని చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నాడు. ఇక ఇప్పటికే రెండు పార్టులుగా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో ఈ సినిమాకి మూడో పార్టు కూడా తొందరగా తీసుకురావాలనే ఉద్దేశ్యంలో ఇటు అల్లు అర్జున్, అటు సుకుమార్ ఆసక్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక సినిమా చివర్లో కూడా ‘పుష్ప 3’ (Pushpa 3) ఉంటుందనే విషయం చాలా స్పష్టంగా తెలియజేశారు. మరి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప 3 సినిమాలో మెయిన్ విలన్ గా జగపతిబాబు నటించబోతున్నాడనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి.
ఎందుకంటే పుష్ప రాజ్ తన తమ్ముడిని అలాగే తమ్ముడి కొడుకుని చంపాడు కాబట్టి అతని మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఆయన భారీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక పుష్ప 3 సినిమా కూడా చాలా రసవత్తరంగా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది.
ముఖ్యంగా అల్లు అర్జున్, జగపతి బాబు మధ్య టగ్ ఆఫ్ వార్ గా ఈ సినిమాను నడిపించబోతున్నారట…మరి ఈ సినిమాను ఎప్పుడు సెట్స్ మీదకు తీసుకెళ్తారు అనే విషయంలో క్లారిటీ లేదు కానీ మొత్తానికైతే ఈ సినిమా ఉంటుందనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తోంది…