https://oktelugu.com/

Mahesh Babu Pachigolla: అనుష్క కి కథ చెప్పడానికి ఆ దర్శకుడు చాలా ఇబ్బంది పడ్డారట..

ముందుగా తన మొదటి సినిమాకి ఈ సినిమాకి ఉన్న గ్యాప్ గురించి చెపుటు.."ఈ గ్యాప్‌లో నేను కథలు రాసుకుంటూ ఉన్నాను. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి కథను అనుష్క ఫ్రెండ్ ఒకరికి చెప్పాను.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : September 8, 2023 1:25 pm
    Mahesh Babu Pachigolla

    Mahesh Babu Pachigolla

    Follow us on

    Mahesh Babu Pachigolla: ఎన్నో సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్లీ అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాంతో ఈ సినిమాపై ప్రేక్షకులకు మంచి అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా అనుష్క అభిమానులు ఈ చిత్రంపై ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు. ఇక సెప్టెంబర్ 7న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర దర్శకుడు అనుష్క గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి.

    ఈ సినిమా దర్శకుడు విషయానికి వస్తే రారా కృష్ణయ్య సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన పి.మహేష్ బాబు.. కొంత విరామం తర్వాత తెరకెక్కించిన సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. కాగా తన మొదటి సినిమాకి ఈ సినిమాకి అంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారో అలానే ఈ సినిమా అనుష్క వరకు ఎలా వెళ్ళిందో అన్న విషయాలను తెలియజేశారు మహేష్.

    ముందుగా తన మొదటి సినిమాకి ఈ సినిమాకి ఉన్న గ్యాప్ గురించి చెపుటు..”ఈ గ్యాప్‌లో నేను కథలు రాసుకుంటూ ఉన్నాను. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి కథను అనుష్క ఫ్రెండ్ ఒకరికి చెప్పాను. అతను అనుష్కకు చెబుతాడు.. ఆమె ద్వారా కొంచెం పెద్దవాళ్ల దగ్గరకు నా స్క్రిప్ట్ వెళ్తుందని అనుకున్నా. అనుష్క ఒకరోజు పిలిపించి కథ చెప్పమన్నారు. అక్కడే యూవీ ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారు. ఆమెకు కథ చెప్పాక మీరు మూవీ ఎవరితో చేయాలని అనుకుంటున్నారు అని అడిగారు. డైలాగ్ వెర్షన్ పూర్తయ్యాక ఆలోచిస్తా అని చెప్పాను. సినిమా కథ, కంటెంట్ మీద నాకున్న ఫోకస్ వారికి తెలిసింది” అని తెలియజేశారు.

    ఇక అనుష్క గురించి మాట్లాడుతూ..”అనుష్క బాహుబలి, భాగమతి లాంటి సబ్జెక్ట్స్ చేసి ఉన్నారు. ఆమె కూడా ఇలాంటి ఎంటర్‌టైన్మెంట్ కథ కోసం వేచి చూస్తున్నారట. నేను ఈ కథ చెప్పగానే ఆమెకు నచ్చింది. ఆమె ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. యూవీ వాళ్లు కూడా ఇంప్రెస్ అయ్యారు. యూవీ సంస్థ ఈ సినిమా కోసం నేనెంత ఇంట్రెస్ట్‌గా ఉన్నానో అంతకంటే ఎక్కువ ఇన్వాల్వ్‌మెంట్ చూపించింది. పెద్ద బ్యానర్ నా విజన్‌ను నమ్మినందుకు హ్యాపీగా అనిపించింది” అని చెప్పకు వచ్చారు.

    అంతేకాదు తాను అనుష్కకి కథ చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడ్డాను అని కూడా చెప్పుకొచ్చారు ఈ డైరెక్టర్.
    “ఈ సినిమాలో బోల్డ్ కంటెంట్ ఉంటుంది కానీ అడల్ట్ కంటెంట్ కాదు. అనుష్క, నవీన్ లాంటి యాక్టర్స్‌కు ఒక ఇమేజ్, క్రెడిబిలిటీ ఉంటుంది. కంటెంట్ బాగా లేకుంటే అసలు వాళ్లే ఈ సినిమా ఒప్పుకోరు. సెన్సార్ నుంచి యూఏ సర్టిఫికెట్ వచ్చింది. ఒక్క క్షణం కూడా ఇబ్బంది పడకుండా సినిమా చూశామని సెన్సార్ వాళ్లు చెప్పారు. ఈ కథ నెరేట్ చేస్తున్నప్పుడు కూడా ఫస్ట్ టైమ్ అనుష్క దగ్గర ఇబ్బంది అనిపించింది. అయితే ఆమె ఎంతో ఓపెన్ మైండ్‌తో కథ విన్నారు. నేను మరోసారి కథ వివరంగా చెప్పడానికి వెళ్లినప్పుడు కూడా ఆమె ఎంజాయ్ చేస్తూ నెరేషన్ విన్నారు” అని అన్నారు మహేష్ బాబు.