J. D. Chakravarthy: శివ మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన జేడీ చక్రవర్తి గులాబీ చిత్రంతో హీరో అయ్యాడు. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన ఆ చిత్రం అప్పట్లో సెన్సేషన్. న్యూ ఏజ్ లవ్ డ్రామాగా కృష్ణవంశీ తెరకెక్కించారు. కృష్ణవంశీకి అది డెబ్యూ మూవీ. గులాబీ చిత్రంలో జేడీ చక్రవర్తికి జంటగా మహేశ్వరి నటించింది. మహేశ్వరికి శ్రీదేవి చిన్నమ్మ అవుతుంది. గులాబీ హిట్ కావడంతో మహేశ్వరి కూడా బాగా పాప్యులర్ అయ్యింది. జే డీ చక్రవర్తి-మహేశ్వరి కాంబినేషన్ లో వరుసగా సినిమాలు వచ్చాయి.
దెయ్యం, మృగం చిత్రాల్లో వీరు కటకట్టారు. దీంతో మహేశ్వరి-జే డీ చక్రవర్తి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ కథనాలు వెలువడ్డాయి. అప్పట్లో పెద్ద ఎత్తున వీరి ఎఫైర్ రూమర్స్ వినిపించాయి. తాజాగా ఈ పుకార్ల మీద జే డీ చక్రవర్తి స్పందించారు. మహేశ్వరిని నేను పెళ్లి చేసుకోవాలి అనుకోలేదు. ఇద్దరం అనుకుంటే చేసుకునేవాళ్లం. పెళ్లి ఆలోచన లేదు కాబట్టే పెళ్లి జరగలేదు. పెళ్ళికి ముందు ఆమెతో ఎఫైర్ లేదు. పెళ్లి తర్వాత కూడా లేదు.
మహేశ్వరి నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే అన్నారు. అయితే ఒక సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు కృష్ణవంశీ, తాను ఒకే అమ్మాయిని ప్రేమించినట్లు వెల్లడించారు. అయితే ఆ అమ్మాయి ఇద్దరినీ అన్నయ్య అని పిలిచిందట. దాంతో నీరుగారిపోయారట. కృష్ణవంశీ, జే డీ చక్రవర్తి ప్రేమించిన ఆ అమ్మాయి మహేశ్వరి కూడా కావొచ్చని కొందరి భావన. ఇక జే డీ చక్రవర్తి సెన్సేషన్ కోసం ఏదో ఒకటి మాట్లాడతారు. ఆయన మాటల్లో వాస్తవం ఉండకపోవచ్చని పరిశ్రమలో టాక్.
జేడీ చక్రవర్తి వర్మ కాంపౌండ్ నుండి వచ్చిన నటుడు. ఆయన ఆలోచనలకు వర్మకు దగ్గరగా ఉంటాయి. సిల్వర్ స్క్రీన్ మీద జే డీ చక్రవర్తి జోరు తగ్గింది. ఆయన సపోర్టింగ్, క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. 2019లో హిప్పీ టైటిల్ తో విడుదలైన మూవీలో కీలక రోల్ చేశాడు. ఈ చిత్ర హీరో కార్తికేయ కాగా ప్రమోషన్స్ లో జే డీ చక్రవర్తి ప్యాంటు తీసేశాడు. కార్తికేయ కూడా చేశాడు. వీరి వ్యవహారం వివాదాస్పదమైంది. ప్రస్తుతం డిజిటల్ కంటెంట్ లో నటిస్తున్నాడు.