Difference Between Baahubali and RRR: యూనివర్సల్ స్టార్ ప్రభాస్ హీరోగా నేషనల్ డైరెక్టర్ రాజమౌళి తన ‘బాహుబలి’ సినిమాతో ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా దేశ వ్యాప్తంగా కూడా సంచలనం రేపింది. ఇక రాజమౌళి డైరెక్షన్ లోనే ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా వచ్చిన క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ఆర్ఆర్ఆర్ కి బాక్సాఫీస్ దగ్గర బాగానే గిట్టుబాటు అయ్యింది. కానీ.. బాహుబలి రేంజ్ లో కలెక్షన్స్ రాలేదు.
‘బాహుబలి’ రెండు పార్ట్‌లు బాక్సాఫీస్ వద్ద రూ.2500 కోట్లను కలెక్ట్ చేశాయి. ‘ఆర్ఆర్ఆర్’ రూ.1200 కోట్లను మాత్రమే వసూలు చేసింది. ఎందుకు బాహుబలి కి వచ్చిన ఆదరణ ఆర్ఆర్ఆర్ రాలేదు ?, బాహుబలిని చూసినంత ఆసక్తిగా ఆర్ఆర్ఆర్ ను ప్రేక్షకులు ఎందుకు చూడలేదు ?, దీనికి పలు కారణాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ కు కరోనా ప్రభావం బాగా పడింది. దాంతో సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. దీంతో సహజంగానే సినిమాపై ఆసక్తి తగ్గిపోయింది.
Also Read: Happy Birthday Collections: ‘హ్యాపీ బర్త్ డే’ 12 కలెక్షన్స్.. ఇంకా ఎన్ని కోట్లు రావాలంటే ?
కానీ, బాహుబలి విషయానికి వస్తే.. ప్రేక్షకులకు సినిమా పై భారీ అంచనాలు ఉన్న సమయంలోనే రిలీజ్ చేశారు. పైగా పోటీకి ఏ సినిమా లేని, రాని సమయంలో రిలీజ్ చేశారు. దాంతో ప్రేక్షకులకు ఎక్కువ ఆప్షన్స్ లేకుండా పోయాయి. అదే ‘ఆర్ఆర్ఆర్’కి, ‘కేజీఎఫ్ 2’ రూపంలో గట్టి పోటీ ఎదురైంది. అందుకే.. ఆర్ఆర్ఆర్ కి కలెక్షన్స్ భారీగా రాలేదు.
అలాగే బాహుబలి టైమ్ లో ఓటీటీల ప్రభావం ప్రేక్షకుల పై పెద్దగా పడలేదు. కానీ, ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ సమయానికి.. ఓటీటీలే సినిమాలను లీడ్ చేసే పరిస్థితి వచ్చేసింది. ఓ దశలో అయితే.. ‘ఆర్ఆర్ఆర్’ డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ఆలోచన చేశారు. అందుకే.. ప్రేక్షకులు కూడా ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలో వస్తోందని నమ్మారు. దీనికితోడు భారీగా పెరిగిన టికెట్ రేట్లు కూడా ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్స్ పై బాగా ప్రభావం చూపింది.
ప్రేక్షకుల్లో ఓ వర్గం ఒక టికెట్ ను 500 పెట్టి కొనడానికి ముందుకు రాలేదు. దీని వల్ల, ఆర్ఆర్ఆర్ కు ఆదరణ సగం తగ్గిపోయింది. అదే విధంగా బాహుబలిలో విలన్ పాత్ర బాగా పడింది. రానా విలన్ గా అద్భుతంగా నటించాడు. కానీ, ఆర్ఆర్ఆర్ విషయానికి వచ్చే సరికి విలన్స్ బలంగా లేరు. పైగా బ్రిటిష్ వాళ్లను విలన్లుగా పెట్టారు. వాళ్ళు ప్రేక్షకుల పై తమ పూర్తి ఆధిపత్యాన్ని చూపించలేకపోయారు.
అదేవిధంగా బాహుబలిలో తమన్నా, అనుష్క శెట్టి లతో చేసిన రొమాన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యింది. ఇక ‘ఆర్ఆర్ఆర్’ లో మాత్రం అందుకు ఎక్కడా అవకాశం లేకుండా పోయింది. మొత్తానికి హీరోయిన్ పరంగా కూడా ‘ఆర్ఆర్ఆర్’ మైనస్ అయింది. అన్నిటికి కంటే ముఖ్యంగా బాహుబలిని చాలా మంది రెండు మూడు సార్లు చూశారు. ‘ఆర్ఆర్ఆర్’కు అలాంటి టికెట్లు ఎక్కువ తెగలేదు. ఇక బాహుబలి రిలీజ్ అయిన తేదీల్లో స్టూడెంట్స్ కి ఎలాంటి పరీక్షలు లేవు. అదే ఆర్ఆర్ఆర్ రిలీజ్ సంయమలో పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఇది బాగా నష్టం చేసింది. మొత్తానికి ‘ఆర్ఆర్ఆర్’. ‘బాహుబలి’ని అందుకోలేకపోయింది.
Also Read:Sudigali Sudheer- Anasuya Bharadwaj: అనసూయ ఏజ్ పై సుధీర్ హాట్ కామెంట్.. జడ్జిలు షాక్