Regina
Regina Cassandra : పైన ఫోటోలో కనిపిస్తున్న లిటిల్ ప్రిన్సెస్ ఎవరో గుర్తుపట్టగలరా. తెల్ల గౌనులో ఎంతో ముద్దుగా కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు ప్రముఖ హీరోయిన్. ఎంతోమంది కుర్రాళ్ళ హృదయాలు కొల్లగొట్టింది. తమిళ ఇండస్ట్రీ నుంచి తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. యంగ్ హీరోలకు జంటగా వరుస సినిమాలు చేసింది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ లో కూడా ఈ హీరోయిన్ కి మంచి క్రేజ్ ఉంది. అంతేకాదు మెగా హీరోతో ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొంది.
ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా? ఆ హీరోయిన్ మరెవరో కాదు రెజీనా కసాండ్ర. సుధీర్ బాబు హీరోగా నటించిన ‘ శివ మనసులో శృతి ‘ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది రెజీనా. తర్వాత సందీప్ కిషన్ కి జంటగా రొటీన్ లవ్ స్టోరీ సినిమా తో యూత్ ని ఎట్రాక్ట్ చేసింది. ఆ తర్వాత వరుస సినిమాలతో తెలుగులో బిజీగా మారింది. సాయి ధరమ్ తేజ్, సందీప్ కిషన్, అల్లు శిరీష్, నాగ సౌర్య ఇలా యంగ్ హీరోలతో జత కట్టింది.
రెజీనా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో కలిసి మూడు సినిమాల్లో నటించింది. ‘ పిల్లా నువ్వు లేని జీవితం ‘,’ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’,’ నక్షత్రం ‘ సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ సమయంలో వీరిద్దరూ లవ్ లో పడ్డారంటూ అనేక రూమర్లు వచ్చాయి. అయితే అవన్నీ అవాస్తవాలు మేము మంచి స్నేహితులం మాత్రమే అని సాయిధరమ్ తేజ్, రెజీనా క్లారిటీ ఇచ్చారు. రెజీనా పదేళ్ల కెరీర్ లో పలు తెలుగు సినిమాల్లో నటించింది. ఆమెకు స్టార్ హీరోయిన్ హోదా మాత్రం దక్కలేదు.
ప్రస్తుతం తెలుగులో రెజీనాకు పెద్దగా ఆఫర్లు లేవు. ఎక్కువగా తమిళ, హిందీ సినిమాల్లో నటిస్తుంది. అంతేకాదు వెబ్ సిరీస్లు కూడా చేస్తుంది. గ్లామర్ పాత్రలు పక్కన పెట్టేసి నెగిటివ్ రోల్స్, లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రెజీనా నటించిన ‘ అ ‘ మూవీ నటిగా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో రెజీనా అద్భుతంగా నటించింది. అలాగే అడవి శేష్ ‘ ఎవరు ‘ సినిమాలో కూడా నెగిటివ్ రోల్ చేసింది. ఈ సినిమా సూపర్ హిట్ అయింది.
ప్రస్తుతం రెజీనా సెక్షన్ 108, జెట్, విడాముయార్చి, ఫ్లాష్ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. రెజీనా కాసాండ్రా 1990 డిసెంబర్ 13న చెన్నై లో జన్మించింది. మొదట షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. ఆ తర్వాత కోలీవుడ్ లో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. శివ మనసులో శృతి, రొటీన్ లవ్ స్టోరీ, రారా క్రిష్ణయ్య, కొత్త జంట, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, పవర్ వంటి సినిమాల్లో నటించింది.
Web Title: The cute baby in the above photo is now a hot heroine anyone remember
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com