
సినీ పరిశ్రమ అందరికీ సినిమాలు చూపిస్తే.. ఇప్పుడు కరోనా, సినీ పరిశ్రమలకే సినిమా చూపిస్తోంది. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని సినీ పరిశ్రమలు మొత్తం చిక్కుల్లో పడ్డాయి. ఎప్పటికీ కరోనా పోతుందో.. మళ్ళీ మాములు స్థితికి సినిమా పరిశ్రమలు ఎప్పుడు వస్తాయో అర్ధం కాని పరిస్థితి ప్రస్తుతం. ఒక్క టాలీవుడ్ లోనే ఏకంగా 70 సినిమాల వరకూ ఆగిపోయాయని ఇండిస్ట్రీ వర్గాలు లెక్కలేసుకుంటున్నాయి. అంటే సుమారు 700 కోట్ల రూపాయల వరకూ పెట్టుబడులు కరోనా వల్ల ఇరుక్కుపోయాయి అన్నమాట. నిజానికి ఈ 70 సినిమాలు కాకుండా లెక్కలోకి రాని చిన్న సినిమాలు మరో 50 దాకా ఉండొచ్చు.
Also Read : ‘పొలిటీషియన్’తో ఫారెన్ టూర్ వేసిన హీరోయిన్?
మరి ఈ సినిమాలకు పెట్టిన పెట్టుబడి మొత్తం ఇప్పుడు ఎన్నాళ్ళకు చేతికి వస్తోందో తెలియదు. ఒక్క రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ ప్రాజెక్ట్ కే దాదాపు 300 కోట్ల రూపాయలు పెడుతున్నారు, ఆలాగే, మెగాస్టార్ – ఆచార్య, ప్రభాస్ – జాన్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- వకీల్ సాబ్.. కేజిఎఫ్ సీక్వెల్, రజిని సినిమా.. ఇలా చెప్పుకుంటూ పోతే పలు భారీ ప్రాజెక్ట్ ల విలువే వందల కోట్ల రూపాయలు ఉంటాయి. మరి ఆ సినిమాలు మరో ఏడాది వరకూ రిలీజ్ అవ్వవు అని ఇప్పటికే అర్ధం అయిపొయింది. ఈ నేపధ్యంలో సినీ పరిశ్రమ భవిష్యత్ గురించి ఇప్పుడే ఓ అంచనా రావటం కష్టమే. మొత్తానికి కరోనా కారణంగా సినీ పరిశ్రమల నష్టాలు ఎంత మేర ఉంటాయో అని ఆలోచించడానికి కూడా మేకర్స్ భయపడుతున్నారు.
అయితే, కరోనా వల్ల ఎక్కువుగా నష్టపోతుంది మాత్రం పెద్ద నిర్మాతలే. వందల కోట్లు వ్యవహారం.. ఎంత పెద్ద వారైనా.. అందరికీ తట్టుకునే శక్తి ఉండకపోవచ్చు. అలాంటి వారికి ఈ కరోనా భారీగానే దెబ్బ కొట్టింది. ఓవరాల్ గా ఒక్క మాటలో చెప్పుకుంటే సినీ పరిశ్రమకు సంబంధించి రెండు ఆర్ధిక సంవత్సరాలతో పాటు భారీగా పెట్టుబడులు పెట్టిన నిర్మాతల కష్టం కూడా పూర్తిగా పోయినట్లే. దీనికి తోడు పరిశ్రమ పై ఆధారపడిన, వివిధ శాఖల్లో పనిచేసే సుమారు పదకుండు వేల మంది వరకు ఉపాధి కోల్పోయి నానా కష్టాలు పడుతున్నారు. మరి ఈ కరోనా కాలం ఎప్పుడు ముగుస్తుందో, సినీ పరిస్థితులు ఎప్పుడు చక్కదిద్దుకుంటాయో.
Also Read : బిగ్ బాస్ 4 : హౌస్ లో నోయల్ క్రష్ తనే…?