‘ఆర్య’ మూవీతో కెరీర్ స్టార్టింగ్‌లోనే తనకు బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన సుకుమార్ అంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు ఎంతో ఇష్టం. ఆ టైమ్‌లోనే వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది. ‘ఆర్య2’తో ఆ బంధం మరింత బలపడింది. అప్పటి నుంచి ఇద్దరూ ముచ్చటగా మూడోసారి కలిసి పని చేయాలని ఎన్ని ప్లాన్స్ వేసుకున్నా వర్కౌట్ కాలేదు. 2011లో నాగచైతన్య హీరోగా వచ్చిన ‘100 పర్సెంట్ లవ్’ మూవీని తొలుత బన్నీతోనే తీద్దామనుకున్నాడు సుక్కూ. కథ కూడా వినిపించాడు. కానీ, ఆ టైమ్‌లో ‘బద్రీనాథ్’కు కమిట్ కావడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయాడు అల్లు వారి హీరో. అయితే, 11 ఏళ్ల తర్వాత బన్నీ, సుక్కూ కలిసి పని చేయబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ‘పుష్ప’పై ఇండస్ట్రీలో ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయింది.‘రంగస్థలం’తో సుకుమార్, ‘అలవైకుంఠపురములో’తో అర్జున్ ఖాతాలో రీసెంట్‌గా భారీ విజయాలు చేరడంతో వీరిద్దరి కాంబోపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా ఇది పాన్ ఇండియా మూవీగా రాబోతోంది.
Also Read: హాట్ బ్యూటీకి పోలీస్ క్యారెక్టర్ !
గంధం చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో, ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో బన్నీ ‘పుష్పరాజ్’ అనే పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌లో బన్నీ రగ్‌డ్ లుక్‌లో ఆకట్టుకున్నాడు. అతని సరసన హాట్ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమాలో ఆమె పోలీసు పాత్ర చేస్తోందని టాక్. విలన్‌గా తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని తీసుకున్నారు. కానీ, ఇతర సినిమాలతో బిజీగా ఉండడంతో అతను ఆ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగాడు. ప్రకాశ్ రాజ్, జగపతి బాబు, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్‌ను కేరళలో పూర్తి చేశారు. కానీ, కరోనా కారణంగా షూటింగ్‌కు బ్రేక్ పడింది. వచ్చే నెల నుంచి తిరిగి షూటింగ్ ప్రారంభించాలని బన్నీ, సుక్కూ ప్లాన్ చేస్తున్నారు.
Also Read: పద్మం వికసించని నవరస నట సార్వభౌముడు !
రీసెంట్‌గా ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర విషయం తెలిసింది. ‘పుష్ప’లో బన్నీ క్యారెక్టర్లో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉంటాయట. ఆ రోల్‌లో అనూహ్యమైన ట్విస్ట్ ఉంటుందని, మూవీలో ఇదే బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అని ఫిల్మ్ సర్కిల్‌లో చర్చ నడుస్తోంది. రంగస్థలం మాదిరిగా క్లైమాక్స్‌కు ముందు ఈ ట్విస్ట్ రివీల్ అవుతుందట. దాంతో, ప్రేక్షకులు ఆశ్చర్యపోతారని, ఈ మూవీని వాళ్లు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారట. బన్నీ, రష్మిక తొలిసారి జోడీగా నటిస్తున్న ఈ మూవీని ఐదు భాషల్లో రిలీజ్ చేయనున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంతో పాటు ఫస్ట్‌టైమ్ బన్నీ మూవీ హిందీలో కూడా నేరుగా రిలీజ్ కాబోతోంది.