Aamir Khan: దేశం లో ఉన్న టాప్ స్టార్స్ అందరినీ ఒక సినిమాలో పెట్టి భారీ బడ్జెట్ తో తీస్తున్నారంటే, అభిమానులు, ప్రేక్షకులు ఎలా ఊహించుకుంటారు?, కచ్చితంగా కనీవినీ ఎరుగని రేంజ్ క్యారెక్టర్స్ వాళ్ళ కోసం రాసి ఉంటారు, తమ అభిమాన హీరోలను వెరైటీ రోల్స్ లో చూసి ఎంజాయ్ చేయొచ్చు అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా కోరుకుంటారు. అలా టాప్ స్టార్స్ అందరూ ఎవరి సినిమాలో పడితే వాళ్ళ సినిమాల్లో క్యారెక్టర్స్ వేయడానికి ఒప్పుకోరు, రజినీకాంత్, చిరంజీవి లాంటి సూపర్ స్టార్స్ సినిమాల్లో మాత్రమే నటిస్తారు. అలా రీసెంట్ గా సూపర్ స్టార్ రజినీకాంత్(Super star Rainikanth) హీరో గా నటించిన ‘కూలీ'(Coolie Movie) చిత్రం లో కూడా నటించారు. అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), అమీర్ ఖాన్(Amir Khan), ఉపేంద్ర(Upendra) లాంటి సూపర్ స్టార్స్ ని ఈ చిత్రం లో పెట్టుకున్నారు. నాగార్జున క్యారక్టర్ ని ఫస్ట్ హాఫ్ లో బాగానే చూపించారు.
కానీ సెకండ్ హాఫ్ లో వీక్ విలన్ గా చూపించి రజినీకాంత్ చేతిలో చావు దెబ్బలు తిని చనిపోయే క్యారక్టర్ గా మార్చేశాడు ఆ చిత్ర డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. నాగార్జున ఎంత పెద్ద సూపర్ స్టార్, ఆయన చేసిన సినిమాలు ఎలాంటివి, అలాంటి స్టార్ హీరో చేత ఇలాంటి రెగ్యులర్ విలన్ రోల్ వేయించాలని ఆలోచన కేవలం లోకేష్ కనకరాజ్ కి తప్ప ఇండియా లో ఎవరికీ రాదు. ఇక కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర అయితే రజినీకాంత్ అసిస్టెంట్ క్యారక్టర్ చేసాడు. ఉపేంద్ర ఎలాంటి స్టార్ హీరో, ఆయన చేసిన సినిమాలు ఎలాంటివి, అలాంటి హీరో చేత ఇలాంటి పాత్రనా చేయించేది?. సరే వీళ్లిద్దరి సంగతి పక్కన పెడుదాం, దేశం లో అమీర్ ఖాన్ ని మించిన బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎవ్వరూ లేరు. ఆయన ఖాతాలో రెండు వేల కోట్ల సినిమా ఉంది. ఇప్పటి వరకు ఎవ్వరూ ఆ రికార్డు ని అందుకోలేదు.
అలాంటి సూపర్ స్టార్ ని క్లైమాక్స్ లో ఒక కమెడియన్ లాగా చూపించాడు లోకేష్ కనకరాజ్. అభిమానులు, ప్రేక్షకులు బూతులు తిట్టారు. రీసెంట్ గా అమీర్ ఖాన్ కూడా ఈ క్యారక్టర్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. ఆయన మాట్లాడుతూ ‘డైరెక్టర్ , హీరో మీద గౌరవం తో స్టోరీ కూడా వినకుండా ఆ సినిమా చేసి వెళ్లాను. కానీ నా క్యారక్టర్ ని చాలా చెత్తగా రాసారని వెండితెర మీద చూసిన తర్వాతే అర్థమైంది. నా అభిమానులు కూడా బాగా హర్ట్ అయ్యారు. వాళ్లకు క్షమాపణలు చెప్తున్నాను. భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతాను’ అంటూ చెప్పుకొచ్చాడు అమీర్ ఖాన్. ఇంత ఓపెన్ గా చెప్పాడంటే, ఆయన క్యారక్టర్ ని జనాలు ఏ రేంజ్ లో ఛీత్కరించారో అర్థం చేసుకోవచ్చు. ఒక్క రజినీకాంత్ ని ఎలివేట్ చేయడం కోసం ఇండియా లో ఉన్న బిగ్గెస్ట్ స్టార్స్ అందరిని ఆ సినిమాలో చేర్చి కమెడియన్స్ ని చేసాడు లోకేష్ కనకరాజ్. ఈ విషయం లో ఫ్యాన్స్ ఆయన్ని ఎన్నటికీ క్షమించరు.