Bigg Boss 6 Telugu: మన తెలుగు బుల్లితెర పై సంచలన విజయం సాధించిన బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ గడిచిన సీజన్స్ తో పోలిస్తే ఈ సీజన్ ఆరంభం లో చాలా తక్కువ TRP రేటింగ్స్ ని నమోదు చేసుకున్న విషయం వాస్తవమే..దీనివల్ల బిగ్ బాస్ టీం కి మరియు స్టార్ మా ఛానల్ కి బాగా నష్టాలు వచ్చాయి..ఆ తర్వాత మూడవ వారం నాగార్జున గారు ఇంటిసభ్యులందరికి గట్టి వార్నింగ్ ఇవ్వడం తో అప్పటి నుండి టాస్కులు బలంగా ఆడదానికి ఇంటి సభ్యులు ప్రయత్నిస్తూ వచ్చారు.

ప్రస్తుతం అయితే ఇంటి సభ్యులు బిగ్ బాస్ ఒక టాస్కు ఇస్తే ప్రాణం పెట్టి ఆడదానికి ఇంటి సిద్ధమవుతున్నారు..టాస్కులు కూడా బిగ్ బాస్ చాలా ఆసక్తికరంగా ఉండేలా చూసుకుంటున్నాడు..TRP రేటింగ్స్ కూడా బాగా వచ్చాయి..కానీ ఆరంభం వచ్చిన నష్టాలను పూడ్చడానికి బిగ్ బాస్ ఇప్పుడు ఒక చీప్ ట్రిక్ ప్లే చేస్తున్నాడు..బిగ్ బాస్ టైటిల్ గెలుచుకున్న కంటెస్టెంట్ కి 50 లక్షల రూపాయిలు ప్రైజ్ మనీ వస్తుందనే విషయం మన అందరికి తెలిసిందే.
ఈ ప్రైజ్ మనీ కి చిల్లుపడే విధంగా బిగ్ బాస్ ఒక టాస్కు ని రూపొందించాడు..ఈ వారం నామినేషన్స్ నుండి బయటపడడానికి ఒక ఇంటి సభ్యునికి అవకాశం ఇస్తున్నాం..కానీ దానికి బిగ్ బాస్ ప్రైజ్ మనీ నుండి కొంత డబ్బు మైనస్ అవుతుందని..నామినేషన్స్ లో ఉన్న ప్రతి కంటెస్టెంట్ లక్ష నుండి 5 లక్షల వరుకు చెక్ అమౌంట్ ఎవరికీ నచ్చినట్టు వాళ్ళు రాసుకొని డ్రాప్ బాక్స్ లో వెయ్యాలని..ఎవరికీ అయితే హైయెస్ట్ యూనిక్ అమౌంట్ ఉంటుందో వాళ్ళు నామినేషన్స్ నుండి సేవ్ అవుతారని బిగ్ బాస్ చెప్తాడు..ఈ టాస్కు లో రాజ్ అందరికంటే హైయెస్ట్ యూనిక్ అమౌంట్ ని బిడ్ చేసి నామినేషన్స్ నుండి సేవ్ అవుతాడు..అందుకుగాను బిగ్ బాస్ ప్రైజ్ మనీ అమౌంట్ 50 లక్షల నుండి 45 లక్షలకు పడిపోతుంది..ఇక ఆ తర్వాత బిగ్ బాస్ మరో షాకింగ్ ప్రకటన చేస్తాడు..ఇప్పటి నుండి ఇంటి సబ్యులకు బిగ్ బాస్ ఒక ఛాలెంజ్ ఇస్తాడు..ఆ ఛాలెంజిలు గెలిస్తే 45 లక్షలకు ఒక్కో లక్ష పెరుగుతుంది..లేదంటే లక్ష తగ్గిపోతుంది అని చెప్తాడు.

మొదటి ఛాలెంజి లో భాగంగా ఇంటి సభ్యులు ఎవరో ఇద్దరు కలిసి రెండు వికెట్ల మధ్య 7 నిమిషాలలో వంద పరుగులు తియ్యాలంటాడు..రేవంత్ మరియు రోహిత్ ఈ ఛాలెంజ్ ని స్వీకరించి రంగంలోకి దిగుతారు..కానీ 80 మాత్రమే చెయ్యడం తో ఛాలెంజి లో ఓడిపోతారు..ఈ ఛాలెంజ్ ఓడిపోయినందుకు గాను మరో లక్ష తగ్గించి 44 లక్షలకు ప్రైజ్ మనీ ని కుదిస్తాడు బిగ్ బాస్..ఇక ఈ వారం లో అలాంటి ఛాలెంజిలను ఎన్ని పెట్టి ఎన్ని లక్షలు తగ్గిస్తాడో అని ఇంటి సభ్యులు భయపడుతున్నారు.