https://oktelugu.com/

Chiranjeevi Fans: కొరటాల శివ వల్ల ఆచార్య కి పెద్ద సమస్య.. ఆవేశం తో రగిలిపోతున్న ఫాన్స్

Chiranjeevi Fans: కరోనా కారణంగా అనేక సార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఈ నెల 29 వ తారీఖున విడుదల అవ్వబోతున్న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా గురించి రోజుకో పుకారు సోషల్ మీడియా లో ప్రచారం అవుతూ అభిమానులను కంగారు పడేలా చేస్తోంది..అదేమిటి అంటే ఈ సినిమాకి నైజం ప్రాంతం లో దిల్ రాజు కుట్రపూరితంగా థియేటర్లను ఇవ్వడం లేదు అని..ఆచార్య సినిమాకి ఈ ప్రాంతం లో నష్టం కలిగించేందుకు దిల్ రాజు కుట్రలు చేస్తున్నాడు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 26, 2022 / 05:35 PM IST
    Follow us on

    Chiranjeevi Fans: కరోనా కారణంగా అనేక సార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఈ నెల 29 వ తారీఖున విడుదల అవ్వబోతున్న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా గురించి రోజుకో పుకారు సోషల్ మీడియా లో ప్రచారం అవుతూ అభిమానులను కంగారు పడేలా చేస్తోంది..అదేమిటి అంటే ఈ సినిమాకి నైజం ప్రాంతం లో దిల్ రాజు కుట్రపూరితంగా థియేటర్లను ఇవ్వడం లేదు అని..ఆచార్య సినిమాకి ఈ ప్రాంతం లో నష్టం కలిగించేందుకు దిల్ రాజు కుట్రలు చేస్తున్నాడు అని ఈ సినిమా నైజం ప్రాంత హక్కులను కొనుగోలు చేసిన వరంగల్ శ్రీను ఆరోపణలు చేస్తునట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ఎందుకంటే ఆచార్య సినిమా దర్శకుడు కొరటాల శివ తో దిల్ రాజు కి భరత్ అనే నేను సినిమా సమయం లో నైజం ప్రాంత పంపిణి విషయం పెద్ద గొడవలు జరిగాయి అని..అందుకే ఆచార్య సినిమా కి నైజం ప్రాంతం లో థియేటర్ల కొరత సృష్టిస్తున్నాడు అని ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్.

    Koratala Siva

    అంతే కాకుండా క్రాక్ సినిమా సమయం లో ఆ చిత్ర నైజం ఏరియా హక్కులను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్ కూడా వరంగల్ శ్రీనుయే..ఈ సినిమా విడుదల సమయం లో దిల్ రాజు తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన మాస్టర్ సినిమా తెలుగు వెర్షన్ నైజం ప్రాంత హక్కులను కొనుగోలు చేసాడు..హైదరాబాద్ సిటీ లో అద్భుతమైన గ్రాస్ వచ్చే థియేటర్స్ అన్ని మాస్టర్ సినిమాకి బ్లాక్ చేసి, క్రాక్ సినిమాకి డబ్బా థియేటర్స్ ఇచ్చాడు..అప్పట్లో దీనిపై వరంగల్ శ్రీను ధర్నా చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..దిల్ రాజు ఒక్క డబ్బింగ్ సినిమా కోసం తెలుగు లో రవితేజ లాంటి పెద్ద స్టార్ హీరో సినిమాకి థియేటర్స్ ఇవ్వకుండా కుట్ర చేసాడు అంటూ వరంగల్ శ్రీను మీడియా ముందు అప్పట్లో మాట్లాడిన మాటలు ఎంత సంచలనం సృష్టించాయి..దీనితో నైజం లో దిల్ రాజు కంటే గొప్పగా ఎదగాలి అనే కసితో స్టార్ హీరోల సినిమాలను దిల్ రాజు తో పోటీపడి మరి కొనుగోలు చేసాడు వరంగల్..అలా కొన్న సినిమాలలో ఆచార్య కూడా ఒక్కటి.

    Also Read: Prashant kishor: కాంగ్రెస్ కు ‘హ్యాండ్’ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్.. గట్టి షాక్

    తనతో విభేదాలు కొరటాల శివ మరియు వరంగల్ శ్రీను ఇద్దరు ఆచార్య సినిమా లో భాగం అవ్వడం తో దిల్ రాజు హైదరాబాద్ సింగల్ స్క్రీన్స్ ఆచార్య కి పెద్ద బొక్క పెట్టెల ఉన్నాడు అని అభిమానుల నుండి వస్తున్నా ఆరోపణ..ఇది కాసేపు పక్కన పెడితే దిల్ రాజు కి చిరంజీవి మరియు రామ్ చరణ్ తో ఎన్నో సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి..ప్రస్తుతం రామ్ చరణ్ తో శంకర్ దర్శకత్వం లో ఒక్క భారీ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి కూడా మన అందరికి తెలుసు..అయినప్పటికీ ఆచార్య సినిమాని తొక్కాలని చూడడం ఏమిటి అని అభిమానులు దిల్ రాజు పై మండిపడుతున్నారు..దిల్ రాజు నైజం ప్రాంతం లో KGF చాప్టర్ 2 సినిమా హక్కులను కొనుగోలు చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ మూవీ కి ఓపెనింగ్స్ అద్భుతంగా వచ్చినప్పటికీ..వీక్ డేస్ లో మాత్రం ఆశించిన స్థాయి వసూళ్లు రావడం లేదు..తెలుగు వెర్షన్ కూడా దాదాపుగా క్లోసింగ్ వరుకు వచ్చేసింది ఈ సినిమా..అలాంటి మూవీ కి సింగల్ స్క్రీన్ థియేటర్స్ ని హోల్డ్ చేసి మెగాస్టార్ సినిమాకి బొక్క పెట్టాలనుకోవడం సరికాదు అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు..మరి దిల్ రాజు మనసు మార్చుకొని ఆచార్య సినిమాకి థియేటర్స్ వదులుతాడా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

    Also Read: Balakrishna Another Surgery: బాలయ్య కి మరో సర్జరీ.. ఆందోళనలో ఫాన్స్

    Recommended Videos:

    Tags