Photo Story: ఒకప్పుడు సినిమాల్లో ఒక్క ఛాన్స్ వస్తే చాలా తమ దశ తిరిగిపోతుందని అనుకున్నారు. కానీ నేటి కాలంలో పదుల కొద్దీ సినిమాలు చేసినా స్టార్ డం రావడం లేదు. ఈ నేపథ్యంలో ఒకప్పుడు స్టార్ గా వెలుగు వెలిగిన ఓ హీరోయిన్ తనకున్న నెపోటిజంతో కూతుళ్లను ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారు. అయితే ఆమెకొచ్చిన గుర్తింపు కూతుళ్లకు రాలేదు. వీళ్లు కొన్ని సినిమాల్లో కనిపించినా ఆ తరువాత అవకాశాలు రాకపోవడంతో ఖాళీగా ఉంటున్నారు. ఎంత సినీ బ్యాగ్రౌండ్ ఉన్నా కాస్త అదృష్టం లేకపోతే సినిమాల్లో రాణించలేరని వారి విషయంలో అర్థమవుతోంది. అయితే ఆ స్టార్ హీరోయిన్ తన కూతురితో ఉన్న చిన్నానాటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ పిక్ ను చూసి చాలా మంచి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
1980లల్లో హీరోయిన్ గా అవకాశం వచ్చిన ప్రతీ ఒక్కరూ దాదాపు స్టార్ అయిపోయారు. అలాంటి వారిలో రాధ ఒకరు. భారతీరాజా డైరెక్షన్లో వచ్చిన ‘అలైగళ్ ఓయివత్తిళ్లై’ సినిమాతో రాధ సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తరువత రజనీకాంత్, కమలాసన్ స్టార్ నటులతో కలిసి పనిచేసింది. ఆ తరువాత 1982లో ‘గోపాలకృష్ణుడు’ అనే తెలుగు సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవితో కలిసి అడవిదొంగ, రాక్షసుడు సినిమాల్లో మెరిసింది. కెరీర్ మంచి పొజిషన్లో ఉండగానే రాధ వివాహం చేసుకుంది. ముంబయ్ కు చెందిన రాజశేఖర్ నాయర్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. వీరిలో ఒకరు కార్తీక, మరొకరు తులసి.
కార్తీక తెలుగులో ‘జోష్’ సినిమాతో ఆరంగేట్రం చేసింది. అయితే ‘రంగం’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. అంతకుముందే కార్తీకకు తల్లి రాధ శాస్త్రీయ నృత్యాన్ని నేర్పించారు. ఇక కార్తీక కు సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో ఖాళీగానే ఉన్నారు. రెండో కూతురు తులసి ‘కడలి’ సినిమాతో వెండితెరపై మొదటిసారి కనిపించారు. ఆ తరువాత ఈమెకు కూడా అవకాశాలు రాకపోవడంతో ఖాళీగానే ఉంటున్నారు. సినీ బ్యాగ్రౌండ్ ఉన్నా వీరికి అదృష్టం కలిసి రాకపోవడంతో అవకాశాలు రావడం లేదని కొందరు చర్చించుకుంటున్నారు.
ఇక వీరికి సంబంధించిన ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కార్తీక తల్లి రాధలో కలిసి చిన్నప్పడు ఓ ఫొటో దిగారు. ఈ ఫొటోతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. తల్లి స్టార్ అయ్యారు..కూతుళ్లు కాలేకపోయారు.. అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. అయితే రాధ తన కూతుళ్లను సినీ ఇండస్ట్రీలోకి చొరవ చూపించి పరిచయం చేసినా స్టార్ డం రాకపోయేసరికి నిరాశతో ఉన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న పోటీ కారణంగా వీరికి అవకాశాలు రావడం లేదని చర్చించుకుంటున్నారు.