Tripti Dimri: రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో రన్బీర్ కపూర్ హీరోగా వచ్చిన అనిమల్ సినిమా భారీ సక్సెస్ ను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పటికే ఈ సినిమా 500 కోట్లపైన వసూళ్లను రాబట్టగా ఈ సినిమా లాంగ్ రన్ లో భారీ కలక్షన్స్ ని కొల్లగొట్టే అవకాశాలు ఉన్నాయంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సినిమా రన్బీర్ కపూర్ కెరియర్ లో భారీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిపోతుంది.ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ కూడా మంచి విజయాలను అందుకున్నప్పటికీ కలక్షన్స్ పరంగా ఈ సినిమా ఒక రికార్డుని క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తుంది. అక్కడ ఖాన్ త్రయానికి కూడా సాధ్యం కానీ కలక్షన్లను ఈ సినిమా సాధించి చూపిస్తుంది.
అయితే ఈ సినిమాలో రణ్బీర్ కపూర్ కి జోడిగా రష్మిక మందాన నటించినప్పటికీ ఆమెతో పాటుగా మరో హీరోయిన్ కూడా ఒక 15 నిమిషాల పాటు స్క్రీన్ షేర్ చేసుకోవడం జరిగింది. ఆమెకి రన్బీర్ కపూర్ కి మధ్య వచ్చిన సీన్లు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఆ నటి ఎవరు అంటే త్రిప్తి డిమ్రి…
ఈమె స్క్రీన్ మీద కనిపించేది చాలా తక్కువ సమయం అయినప్పటికీ హీరోయిన్ రష్మిక మందాన కంటే కూడా ఈమె చాలా ఎక్కువ పేరుని సంపాదించుకుంది. అయితే ఈమె ఇంతకుముందు కొన్ని సిరీస్ లలో కూడా నటించింది.ఆ సీరీస్ లలో తనని చూసిన సందీప్ రెడ్డి వంగ ఈ సినిమా కోసం తనను సెలెక్ట్ చేశాడు…అయితే ఆమె పోషించిన పాత్ర ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక దాంతో ఇప్పుడు త్రిప్తి గురించి పాన్ ఇండియా రేంజ్ లో చర్చ జరుగుతుంది. ఇక ఇప్పటికే ఆమె నటనకి ఫిదా అయిన రవితేజ అనిల్ రావిపూడి తో చేసే సినిమాలో తనని హీరోయిన్ గా తీసుకున్నట్టు గా తెలుస్తుంది.
నిజానికి రష్మిక మందనా సినిమా మొత్తం కనిపించిన కూడా రాని క్రేజీ త్రిప్తి 15 నిమిషాల్లోనే సంపాదించుకుంది.ఇక ఆమె అందానికి ప్రతి ప్రేక్షకుడు కూడా ఫిదా అవ్వక తప్పలేదు…ఈమెకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో మంచి ఫ్యూచర్ ఉందంటూ ఇప్పటికే ట్రేడ్ పండితులు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి అర డజన్ సినిమాల్లో ఆమెకి హీరోయిన్ గా అవకాశం వచ్చినట్టు గా తెలుస్తుంది…
View this post on Instagram