2022 Oscars Gossip: ప్రతి నటుడి కల ఒక్కటే.. అదే ఆస్కార్ అవార్డు. దాన్ని అందుకోవడం కోసం ఎన్ని కలలు కంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారంగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో సంచలన ఘటన జరిగింది. ముందుగా దీన్ని అందరూ కామెడీనేమో అనుకున్నారు. కానీ తర్వాత జరిగింది తెలుసుకుని షాక్ అయిపోయారు. కామెడీ చేయాలని చూస్తే.. చివరకు యాంకర్ చెంప చెల్లుమంది.
అసలు ఏమైందో వివరంగా చూద్దాం.. ఆస్కార్ వేడుకల మహోత్సవానికి అమెరికాకు చెందిన ప్రముఖ కమెడియన్ క్రిస్ రాక్ వ్యాఖ్యాతగా(యాంకర్)గా వ్యవహరిస్తున్నారు. అయితే ఆయన ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డును ప్రకటించే ముందు.. అందరినీ నవ్వించడానికి ఓ కామెడీ ట్రాక్ అందుకున్నాడు. ఇందులో భాగంగా ఆయన ప్రముఖ నటుడు విల్ స్మిత్ భార్య జాడా పింకెట్ మీద కామెంట్ చేశారు.

ఈ వేడుకకు ఆమె తలమీద వెంట్రుకలు లేకుండా గుండులో హాజరయ్యారు. అయితే క్రిస్ రాక్.. ఆమెను జీఐజేన్ మూవీలోని డెమి మూర్ పాత్రతో పోల్చారు. ఈ మూవీలో డెమిమూర్ పాత్ర పూర్తి గుండులోనే ఉంటుంది. దీంతో జీఐజేన్ మూవీకి సీక్వెల్ లో మీరేమైనా నటిస్తున్నారా అంటూ పింకెట్ మీద కామెడీ చేసి నవ్వించే ప్రయత్నం చేశాడు క్రిస్ రాక్.
అప్పటి వరకు నవ్వుతూ కనిపించిన స్మిత్.. ఒక్కసారిగా సీరియస్ గా స్టేజిమీదకు ఎక్కాడు. అందరూ తదేకంగా ఏం జరుగుతుందా అనిచూస్తూ ఉన్నారు. కానీ స్మిత్ అందరికీ షాక్ ఇస్తూ క్రిస్ రాక్ చెంప చెల్లుమనిపించి సైలెంట్ గా వచ్చి తన కుర్చీలో కూర్చున్నారు. అప్పటి వరకు అసలు అతను ఎందుకు కొట్టాడో ఎవరికీ అర్థం కాలేదు.
కుర్చీలో కూర్చున్న తర్వాత క్రిస్‌రాక్‌కు స్మిత్ రెండుసార్లు వార్నింగ్ ఇచ్చాడు. తన భార్య ప్రస్తావన తేవొద్దంటూ తెలిపాడు. వాస్తవానికి స్మిత్ భార్య పింకెట్ అలో పేసియా అనే వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి ఉన్న వారి జుట్టు మొత్తం ఊడిపోతుంది. పింకెట్‌కు కూడా అదే జరిగింది. వ్యాధితో ఉన్న తన భార్యపై కామెంట్స్ చేయడాన్ని స్మిత్ తట్టుకోలేక ఇలా చేశాడని అర్థమవుతోంది.
కానీ క్రిస్ రాక్ మాత్రం దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. ఇక స్మిత్ ఉత్తమ నటుడిగా ఎంపికయిన తర్వాత.. స్టేజి మీదకు వచ్చి నిర్వాహకులకు తాను చేసిన పనిపై క్షమాపణలు కూడా చెప్పాడు. ఈ మొత్తాన్ని చూస్తే.. ఎవ్వరైనా ఉండాల్సిన హద్దుల్లో ఉండాలి తప్ప.. కామెడీ కోసం వ్యాధితో బాధపడుతున్న వారిపై ఇలాంటి కామెంట్స్ చేస్తే ఊరుకుంటారా మరి.
#badboys3 #gijane2 #willsmith #chrisrock #oscars #besttvever
Can’t believe what I just saw live on screen pic.twitter.com/YiijPRQENt
— Guy Springthorpe (the pistol slug) (@GuySpringthorpe) March 28, 2022