Prabhas Fans: రాధే శ్యామ్ మూవీ ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ అందరిలో కొనసాగుతుంది. అయితే ప్రోమోల ద్వారా ఓ క్లారిటీ వచ్చింది. ఇది ప్యూర్ ఎమోషనల్ లవ్ డ్రామా. పునర్జన్మల కథ, హీరో హీరోయిన్ చనిపోయి మరలా జన్మించే కాన్సెప్ట్ అనేది, మరో ఊహాగానం. ఈ పుకార్లు, ఊహాగానాల నడుమ.. ప్రభాస్ ని పాల్మిస్ట్(హస్తసాముద్రికుడు)గా కూడా పరిచయం చేశారు. పునర్జన్మల వాదనల మధ్య ఈ జాతకాలు చెప్పే పాత్రేమిటో ఎవరికీ అర్థం కావడం లేదు.

ఇన్ని అనుమానాలు, పుకార్లు ఒకింత ఫ్యాన్స్ ని భయపెడుతున్నాయి. అసలు ప్రభాస్ ఇమేజ్ కి ఇంత క్లాస్ సబ్జెక్ట్ సెట్ అవుతుందా..? అసలు తేడా కొడితే డిజాస్టరే, అనే సందేహాలు ఫ్యాన్స్ మెదడులను తొలిచివేస్తున్నాయి. ఈ భయాల మధ్య వాళ్లలో ధైర్యం నింపుతున్న అంశం ఒకటి రాధే శ్యామ్ చిత్రంలో ఉంది. అది ఏమిటంటే పూజా హెగ్డే.
పూజా హెగ్డే హీరోయిన్ కాబట్టి మా హీరో మూవీ సూపర్ హిట్టే అని కొందరు ఫిక్స్ అయ్యారు. ఈ మధ్య కాలంలో పూజా ట్రాక్ రికార్డు ఆధారంగా.. గుడ్డిగా ఓ అభిప్రాయానికి వచ్చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు. ఒక్క హిట్టు అంటూ ఆరేళ్ళు ప్రదక్షిణలు చేసిన అక్కినేని హీరో అఖిల్ కి పూజా అదృష్ట దేవతలా తగిలింది. అఖిల్ లేటెస్ట్ విడుదల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.
Also Read: స్నేహితులతో మహేశ్ ఫ్యామిలీ వీకెండ్ ఎంజాయ్.. నెట్టింట్లో ఫొటోలు వైరల్
ఫార్మ్ లో లేని కుర్ర హీరోకే ఆ రేంజ్ హిట్ ఇచ్చిన పూజా సెంటిమెంట్, మా పాన్ ఇండియా హీరో విషయంలో మరింత పేలడం ఖాయమని వారు అంటున్నారు. రాధే శ్యామ్ బ్లాక్ బస్టర్ హిట్… నో డౌట్ అంటున్నారు. పూజా హీరోయిన్ గా ఉందని సినిమా హిట్టై పోతుందని, గుడ్డిగా నమ్మడం.. మరీ విడ్డూరమని యాంటీ ఫ్యాన్స్ అంటున్నారు.
మరి ఫ్యాన్స్ భావిస్తున్నట్లు పూజా తన సెంటిమెంట్ రాధే శ్యామ్ విషయంలో కూడా కొనసాగించి హిట్ అందుకుంటుందో లేదో.. మరి కొన్ని రోజులలో తెలిసి పోతుంది. దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న రాధే శ్యామ్ మూవీ జనవరి 14న గ్రాండ్ గా విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీగా విడుదలవుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ఓ కీలక రోల్ చేస్తున్నారు.