Dude Movie Minus: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో యువ కెరటంలా ముందుకు దూసుకొచ్చిన నటుడు ప్రదీప్ రంగనాథన్…జయం రవి హీరోగా ప్రదీప్ రంగనాథన్ డైరెక్షన్ లో ‘కోమలి’ సినిమా వచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఇక ఆ తర్వాత ఆయన డైరెక్షన్ చేస్తూనే హీరోగా చేసిన ‘లవ్ టుడే’ సినిమా యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక ‘డ్రాగన్’ సినిమా సైతం ఆయనకి నటుడిగా మంచి పేరు తీసుకువచ్చింది. ఇప్పుడు ‘డ్యూడ్’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో ప్రదీప్ యాక్టింగ్ బాగుంది. ఇక ఫస్టాఫ్ సైతం ఎంగేజింగ్ గా ఉన్నప్పటికి సెకండాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ మైనస్ అయ్యాయి…
ఫస్టాఫ్ లో కామెడీ తో పాటు ఎమోషనల్ సన్నివేశాలకు మంచి ఆదరణ వచ్చింది. ఇక సెకండాఫ్ లో సెంటిమెంటల్ సీన్స్ ను చాలా ఈజీ వే లో ప్రజెంట్ చేశారు. అంటే వాళ్లకు ఎదురైన బ్యాడ్ సిచువేషన్స్ కి సొల్యూషన్స్ లైట్ వెయిట్ తో రాసుకున్నారు. ఇంకా కొంచెం ఇంపాక్ట్ ఉన్న సీన్స్ పడితే సినిమా ఎక్కడికో వెళ్ళిపోయేది…
మొత్తానికైతే సెకండాఫ్ లో వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలను ఇంకాస్త బాగా రాసుకొని ఉంటే బాగుండేది. అదొక్కటే ఈ సినిమాకి పెద్ద మైనస్ గా మారింది. ఓవరాల్ గా ఎమోషనల్ సీన్స్ ఈ సినిమాకి పెద్ద మైనస్ గా మారాయి… ఇక ప్రదీప్ రంగనాథన్ సైతం తదుపరి సినిమాల విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు.
యూత్ ఫుల్ కాన్సెప్ట్ లను ఎంచుకొని మంచి సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతూ ఉండడం విశేషం…ఆయనకి తెలుగులో కూడా చాలా మంచి మార్కెట్ ఉంది…అందుకే ఈ సినిమా విషయంలో ఆయన చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు… ఇక ఇప్పుడు వచ్చిన డ్యూడ్ సినిమా సైతం లాంగ్ రన్ లో ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తుందో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…అందుకే ఒక సినిమా భారీ సక్సెస్ సాధించాలంటే సినిమాలోని ఎమోషనల్ సన్నివేశాలు బాగా రాసుకోవాలి…