Homeఎంటర్టైన్మెంట్Raveena Tandon: ఆ స్టార్ హీరోయిన్ కి ఏ పార్టీ నచ్చలేదట !

Raveena Tandon: ఆ స్టార్ హీరోయిన్ కి ఏ పార్టీ నచ్చలేదట !

Raveena Tandon: సినిమా వాళ్లకు రాజకీయాలకు దగ్గర సంబంధం ఉంది. సినిమాల్లో కాస్త మంచి ఫేమ్ వస్తే చాలు వెంటనే.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఉత్సాహం చూపిస్తారు. అయితే, హీరోలతో పాటు హీరోయిన్లు కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్నారు. జయలలిత, విజయశాంతి దగ్గర నుంచి పేడ్ అవుట్ స్మాల్ హీరోయిన్ మాధవీలత వరకూ ఇలా చాలామంది భామలు రాజకీయం చేయాలని, రాజకీయ నేతగా ఎదగాలని ప్రయత్నాలు చేశారు.

Raveena Tandon
Raveena Tandon

అందులో, జయలలిత, జయసుధ, జయప్రద, రోజా లాంటి సక్సెస్ అయ్యారు కూడా. అయితే, తాజాగా రవీనా టాండన్ కూడా రాజకీయ ఎంట్రీ పై కొత్త ముచ్చట్లు చెప్పింది. తనకు ఇంతవరకూ ఏ రాజకీయ పార్టీ నచ్చలేదని బాలీవుడ్ నటి రవీనా టాండన్ చెప్పింది. పశ్చిమ బెంగాల్, పంజాబ్, ముంబయి నుంచి పోటీ చేసేందుకు తనకు ఆఫర్లు వచ్చాయని ఆమె వెల్లడించింది.

Also Read: ఆ వ్యూహాలను అమలు చేసే దిశగా కేసీఆర్ కసరత్తులు.. ఇప్పట్లో పూర్తి అయ్యేనా..?

అయితే.. దేశంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ తనను ఆకట్టుకోలేకపోయిందని, అందుకే ఇంకా రాజకీయాల్లోకి రాలేదని ఆమె చెప్పుకొచ్చింది. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా.. ఆమె పలు విషయాలు పంచుకుంది. రాజకీయాల్లోకి రావాలని తనకూ ఉందని మనసులోని మాట బయటపెట్టింది. మొత్తానికి ఆమెకు ఏ పార్టీ నచ్చలేదట.

 

Raveena Tandon
Raveena Tandon

సోనూసూద్‌ కూడా మరో ఐదేళ్లపాటు సమాజ సేవపై దృష్టి పెట్టి, ఆ తర్వాత రాజకీయాల్లోకి వస్తానని నిన్న వెల్లడించిన సంగతి తెలిసిందే. తన ఆలోచనలతో సారూప్యత ఉన్న పార్టీలో చేరతానని, ఈ పదవికి నువ్వే అర్హుడివని అందరూ అనేస్థాయికి ఎదిగాక తప్పకుండా వస్తానని చెప్పుకొచ్చాడు.

Also Read: ఎల్ఐసీ పాల‌సీదారుల‌కు ఫ్రీగా క్రెడిట్ కార్డులు.. ఎలా పొందాలంటే?

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

2 COMMENTS

  1. […] Europe Energy Crisis : మొన్నటి వరకు ఇండియాలో పెట్రో ధరలు భగ్గుమంటున్నాయనే ఆందోళన వ్యక్తమైంది. రేట్లు తగ్గించాలని బీజేపీ సర్కార్ పై తీవ్ర ఒత్తిడి పెరిగింది. అయితే అంతర్జాతీయ సమస్యల కారణంగా రేట్లు తగ్గించేది లేదని ప్రభుత్వం చెబుతున్నా కొందరు పెడచెవినపెట్టారు. అయితే ప్రస్తుతం ఈ పరిస్థితి యూరప్ దేశాల్లోనూ ఏర్పడింది. అక్కడ ఇంధన ధరలు మండిపోతున్నాయి. సామాన్య ప్రజల నుంచి పరిశ్రమల వరకు సరైన సమయంలో ఇంధనం అందకపోవడంతో అల్లాడుతున్నారు. అయితే ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు..? ఎవరి వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది..? […]

  2. […] KCR Modi: ఒక్కో చట్టం చేస్తూ.. రాష్ట్రాల నుంచి మెజార్టీ హక్కులను లాగేసుకుంటున్న మోడీ సర్కార్ మరో సంచలన స్టెప్ వేస్తోంది. ఇప్పటికే జీఎస్టీ పేరుతో పన్ను వసూళ్లను మోడీ తన చేతుల్లోకి తీసుకున్నాడు. తాజాగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కేంద్రానికి డిప్యూటేషన్ పంపడంలో రాష్ట్రాల అధికారాలను కేంద్రం హస్తగతం చేసుకునేలా చట్టాలకు మోడీ సర్కార్ సవరణలు చేస్తోది. ఆల్ ఇండియా సర్వీసెస్ క్యాడర్ రూల్స్ 154కి సవలు చేస్తున్న మోడీ సర్కార్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను సెంట్రల్ డిప్యూటేషన్ ద్వారా బదిలీ చేసే అధికారాలను పొందేందుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular